ఆగష్టు 1 రాశిఫలాలు – ఈ రోజు ఈ రాశివారి ప్రవర్తన, మాటతీరు ఆకర్షణీయంగా ఉంటుంది

[ad_1]

Horoscope Today 2023 August 1st 

మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు చాలా మంచిది. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన వారు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. చేయాల్సిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. 

వృషభ రాశి
ఈ రాశివారు ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న విషయం నుంచి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. మీకున్న వనరులను అర్థవంతంగా ఉపయోగించుకుంటారు. ఎప్పుడో గడిచిపోయిన విషయాలు ఈ రోజు మళ్లీ వెలుగులోకి వస్తాయి. 

మిథున రాశి
ఈ రాశివారికి పనిభారం పెరుగుతుంది. కొన్ని పాత సమస్యలు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. మీ కోపం స్నేహితులను కలవరపాటుకి గురిచేస్తుంది. ఆహారాన్ని నియంత్రించండి. విశ్రాంతి తీసుకునేందుకు సమయం కేటాయించండి. 

Also Read: భోళా శంకరుడికి అవతారాలున్నాయి

కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు చాలా మంచిరోజు. ఉద్యోగులు కార్యాలయంలో మీరు పెద్ద ప్రాజెక్టు పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ ఇమేజ్ మెరుగుపడుతుంది. మీరు తలపెట్టే పనులకు మీ జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు. అవివాహితులకు ఇది మంచి సమయం.  అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం బాగానే సాగుతుంది 

సింహ రాశి 
ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. బిజీ కారణంగా కొన్ని అవసరమైన పనులకు అంతరాయం కలుగుతుంది.  మీ మాటతీరు, ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది. స్నేహితులకు సహాయం చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. 

కన్యా రాశి
ఈ రాశివారు ఈ రోజు ఓర్పు , శాంతితో పని చేయాలి. అలసట వల్ల బలహీనంగా అనిపిస్తుంది.  ప్రాణాయామం చేయడం వల్ల మీకున్న కొన్ని అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటి పెద్దల విషయంలో నిర్లక్ష్యం తగదు. తల్లిదండ్రుల అనుమతితో చేసే పనులు సక్సెస్ అవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

తులా రాశి 
ఈ రోజు తులారాశి వారికి మంచి రోజు కానుంది. ఆర్థిక సమస్య తీరుతుంది. స్నేహితుడి నుంచి ఓ గుడ్ న్యూస్ వింటారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోతాయి. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. అత్యవసరం అయితే కానీ ప్రయాణం చేయకపోవడమే మంచిది.

Also Read: ఆగష్టు మొదటివారం ఈ 3 రాశులవారికి లక్కు మామూలుగా లేదు!

వృశ్చిక రాశి
ఈ రాశివారు కష్టమైన పనిని కూడా ఈ రోజు సులభంగా పూర్తిచేస్తారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. తెలివైనవారు చెప్పిన సలహాలను పరిగణలోకి తీసుకోండి. సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి విజయాన్ని పొందవచ్చు 

ధనుస్సు రాశి
ఈ రాశి ఉద్యోగులు ఇచ్చే సూచనలను కార్యాలయంలో అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  ఇతరులలో లోపాలు చూడొద్దు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

మకర రాశి
ఈ రాశివారికి కుటుంబ సభ్యులపై శ్రద్ధ పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న వ్యవహారాలను ఈరోజు పూర్తి చేస్తారు. సోషల్ మీడియాలో అతి ఉత్సాహం తగ్గించుకుంటే మీకే మంచిది. ముఖ్యమైన ఈవెంట్ కోసం ప్లాన్ చేస్తారు. మీ పనిని ప్రశాంతంగా నేర్పుగా పూర్తిచేయండి. 

కుంభ రాశి
ఈ రాశివారిపై పనిఒత్తిడి ఉంటుంది కానీ ఆ ఒత్తిడిని మీరు అధిగమించి సమయానికి పని పూర్తిచేస్తారు, మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే వ్యక్తులు నేర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. వంశపారపర్యంగా వచ్చే ఆస్తులు దక్కించుకోగలుగుతారు. 

మీన రాశి
ఈ రాశివారు ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే గౌరవం మరింత పెంచుకున్నవారవుతారు. మీ ఆలోచనలను బయటకు వ్యక్తపరచండి.  కిందిస్థాయి ఉద్యోగులతో విభేదాలు ఏర్పడే సూచనలున్నాయి జాగ్రత్త. భవిష్యత్ కోసం ఆలోచించకుండా పెద్ద పెద్ద ఆర్థిక ఒప్పందాలు చేసుకోవడం మంచిదికాదు. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *