[ad_1]
ఆడవారిలో గుండె సమస్యలు..
వయసు పెరిగేకొద్దీ హైబీపి వల్ల రక్త నాళాలు గట్టిపడతాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్‌కి మధ్య ఉన్న సంబంధం. మెనోపాజ్ టైమ్‌లో, ఆ తర్వాత ఆడవారి శరీరం తక్కువ ఈస్ట్రోజెన్‌ని రిలీజ్ చేస్తుంది. ఇది కరోనరి ఆర్టరీస్ ప్రాబ్లమ్‌కి కారణంగా మారతుంది. దీని కారణంగా కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి.
కారణాలివే..
రెగ్యులర్‌గా.. హైబీపి, కరోనరీ ఆర్టరీ సమస్యలు, వాల్వ్ సమస్యలు, డయాబెటిస్ మెల్లిటస్ అనేవి ఆడవారిలో హార్ట్ ఫెయిల్యూర్‌కి కారణమవుతాయి. పెరిపార్టమ్ కార్డియోమపతి అనేది వారిలో హార్ట్ ఫెయిల్యూర్‌కి మరో ముఖ్య కారణం. ఇక్కడ కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. అదేంటంటే మెనోపాజ్ వచ్చాక గుండె పోటు లక్షణాలను తెలుసుకోవడం కాస్తా కష్టంగానే ఉంటుంది. వాటిని మెనోపాజ్ లక్షణాలనే అనుకుంటారు.
ఈస్ట్రోజెన్ ఉంటే..
ఆడవారి బాడీలో ఈస్ట్రోజెన్ ఉంటుంది. దీని వల్ల గుండె సమస్యలు రాకుండా సహజ రక్షణగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డిఎల్‌ని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అదే విధంగా ఈస్ట్రోజెన్ రక్తప్రవాహాన్ని పెంచేందుకు రక్తనాళాలను సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. అదే విధంగా, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.
Also Read : Cardiomyopathy : ఈ సమస్య ఉంటే గుండె కండరాలు సరిగ్గా పనిచేయవట..
డాక్టర్స్ ప్రకారం..
డాక్టర్ మన్మోహన్ సింగ్ చౌహాన్(Consultant and head Cardiothoracic and Vascular surgery, Manipal Hospital Gurugram) ప్రకారం, మెనోపాజ్ తర్వాత బాడీలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. మెనోపాజ్ 40 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా రావొచ్చు. అయితే, ఇది ఎక్కువగా 50 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వస్తుంది. ఈ మెనోపాజ్ వచ్చాక గుండెపోటు రావడం, ప్రాణాంతకంగా మారడం ఎక్కువగా జరుగుతున్నాయని చెబుతున్నారు. బాడీలోని ఈస్ట్రోజెన్ స్థాయిలలో సడెన్‌గా మార్పు దీనికి కారణం కావొచ్చు.
గుండె పోటు లక్షణాలు..
ఆడవారికి గుండెపోటు వచ్చినప్పుడు మెడ, పైభాగంలో నొప్పి, అజీర్ణం, మైకం, వికారం, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కొన్ని సార్లు ఉండకపోవచ్చు. గుండె సమస్యలు మొదట్లో ఉన్నప్పుడు త్వరగా సమస్యని గుర్తించలేకపోవచ్చు. గుండెపోటు, మెనోపాజ్ లక్షణాలు ఆడవారిలో ఒకే విధంగా ఉంటాయి. అవేంటంటే..
Also Read : Epilepsy : ఫిట్స్ సమస్య ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి..
లక్షణాలు..
గుండె దడ
రాత్రిపూట చెమటలు పట్టడం
ఛాతీ ప్రాంతంలో ఇబ్బంది
అలసట
భయం
ఛాతీలోనొప్పి
ఈ లక్షణాలన్నీ మెనోపాజ్, గుండె సమస్యలు రెండింటిలోనూ ఉంటాయని డాక్టర్ చౌహాన్ చెబుతున్నారు.
గుండెపోటు వచ్చినప్పుడు..
గుండె సమస్యలు రాకుండా ముందు నుంచీ జాగ్రత్తగా ఉండాల్సిందే. అందుకే, ముందు నుంచి తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్ళు దాటాక కొన్ని పరీక్షలు చేయించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చేయాల్సిన పరీక్షలు
ట్రెడ్‌మిల్ టెస్ట్(టిఎమ్‌టి)
ఎలక్ట్రో కార్డియోగ్రామ్(ఈసీజి)
ఎకోకార్డియోగ్రామ్
వీటితో పాటు డాక్టర్ సలహాతో మరిన్ని పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సమస్య రాకుండా ముందు నుంచీ జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. డయాబెటిస్, హైబీపి, హై కొలెస్ట్రాల్ ఇప్పటికే ఉంటే వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మెనోపాజ్ వచ్చాక రెగ్యులర్‌గా వర్కౌట్ చేయాలి. హెల్దీ వెయిట్ మెంటెయిన్ చేయాలి. దీంతో పాటు హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Relationship News and Telugu New
[ad_2]
Source link
Leave a Reply