[ad_1]
Fine For Collecting Extrra Fees For Aadhaar Services: భారత ప్రజల గుర్తింపు పత్రాల్లో ఆధార్ ఒక కీలక డాక్యుమెంట్. మన దేశంలో చాలా రకాల పనులు పూర్తి చేయడానికి ఆధార్ తప్పనిసరి. బడిలో చేరడం దగ్గర నుంచి ఉద్యోగంలో జాయిన్ కావడం వరకు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం (Opening a bank account) దగ్గర నుంచి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం (Investing in stock market) వరకు ప్రతి పనికి ఆధార్ కావల్సిందే. ఆధార్ వివరాలు సరిగా లేకపోతే కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలన్నీ నిలిచిపోతాయి. పెన్షన్ రాదు, ప్రభుత్వ రాయితీ వంటి ప్రయోజనాల కోసం పెట్టుకున్న దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది.
వేలి ముద్రలు సరిగా పడకపోవడం, ఫోన్ నంబర్ మారడం (Change of phone number), చిరునామా మార్పు (Change of address), పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ (Spelling mistake in name), పుట్టిన తేదీ లేదా జెండర్ తప్పుగా ఉండడం వంటివి ఆధార్ విషయంలో కనిపించే సాధారణ ఇబ్బందులు. వీటిని సరి చేసుకుంటేనే పైన చెప్పిన ప్రయోజనాలు అందుతాయి. వీటిని, ఉడాయ్ (UDAI) పోర్టల్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా సరిచేసుకోవచ్చు. లేదా, దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ కేంద్రానికి (Aadhaar Center) వెళ్లి, ఆధార్ వివరాల్లో మార్పు చేయించుకోవాలంటే 25 రూపాయలు (Fees For Aadhaar Services) చెల్లించాలి. ఆధార్ వివరాల్లో మార్పు చేయాడనికి కొంతమంది ఆపరేటర్లు 100 రూపాయలు, కొన్ని మారుమూల పల్లె ప్రాంతాల్లో రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ (Winter session of Parliament) ఈ అంశం చర్చకు వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్
వేలిముద్రలు (Biometric), కంటి పాపలు (Iris) తీసుకోవడం సహా, ప్రజల ఆధార్ వివరాలు (Demographic) సరిచేయడానికి ఏ ఆపరేటర్ అయినా ఎక్కువ డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సంబంధిత ఆపరేటర్‌ను సస్పెండ్ చేస్తామని, అతన్ని నియమించిన రిజిస్ట్రార్‌కు 50,000 రూపాయల జరిమానా విధిస్తామని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ (IT Ministry) పార్లమెంట్‌కు తెలిపింది. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ వివరాల అప్‌డేట్‌తో సహా ఆధార్ సర్వీసుల కోసం నిర్ణీత మొత్తానికి మించి డబ్బులు తీసుకోవద్దని ఉడాయ్ ఆధార్ ఆపరేటర్లందరికీ సూచించిందని, లోక్‌సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. నిర్ణీత మొత్తానికి మించి ఎవరైనా అదనంగా వసూలు చేస్తే, ఉడాయ్‌కి ఈ-మెయిల్ చేయాలని, టోల్-ఫ్రీ నంబర్ 1947 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.
ఆధార్ ఉచిత అప్‌డేషన్ గడువు పెంపు (Last date for free update of Aadhaar)
ఆధార్ వివరాల్లో తప్పులుంటే వాటిని ఉచితంగా మార్చుకునే సదుపాయం తుది గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పెంచింది. ఆన్‌లైన్ పద్ధతిలో ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునే గడువు డిసెంబర్ 14, 2023తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది, ఆ గడువును మరో 3 నెలలు పొడిగించింది. ఇప్పుడు, 2024 మార్చి 14 వరకు ఫ్రీ అప్‌డేషన్ గడువు ఉంది.
మీ ఆధార్‌లో తప్పులు ఉంటే, లేదా, మీ ఆధార్‌ను అప్‌డేట్ చేసి 10 సంవత్సరాలు అయితే కచ్చితంగా ఆధార్ వివరాలను నవీకరించాలి, ఇది పౌరుల బాధ్యత. మైఆధార్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in ద్వారా ఉచిత అప్‌డేషన్ సదుపాయాన్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: సావరిన్ గోల్డ్ బాండ్‌పై వచ్చే ఆదాయం టాక్స్-ఫ్రీ కాదు, ఈ ఒక్క సందర్భంలోనే మినహాయింపు!
[ad_2]
Source link
Leave a Reply