[ad_1]
‘భారత్‌కు జాబిల్లితోపాటు అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లి పరిశోధనలు చేసే సామర్ధ్యం ఉంది. అందుకు మన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలి. వీటితో పాటు అంతరిక్ష ప్రయోగాలకు పెట్టుబడులు కూడా అవసరం.. దానివల్ల అంతరిక్ష పరిశోధనా రంగం సహా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇదే మా లక్ష్యం’ అని సోమనాథ్ స్పష్టం చేశారు. అలాగే, అంతరిక్ష రంగ అభివృద్ధికి ప్రధాని మోదీ విజన్‌తో ఉన్నారని తెలిపారు. ప్రధాని తమకు నిర్దేశించిన భవిష్యత్తు లక్ష్యాలను పూర్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సోమనాథ్ వెల్లడించారు.
ఇదే సమయంలో సొంతం కేరళకు వెళ్లిన సోమనాథ్.. ఆదివారం తిరువనంతపురంలో ఉన్న భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తి అనే పేరు పెట్టడాన్ని ఆయన సమర్థించారు. శివశక్తి, తిరంగా (చంద్రయాన్- 2 క్రాష్‌ల్యాండ్ అయిన ప్రాంతానికి పెట్టిన పేరు).. రెండు పేర్లు భారతీయతకు చిహ్నమని అన్నారు. జీవితంలో సైన్స్, ఆధ్యాత్మికత ఈ రెండు అంశాలపట్ల తనకు ఆసక్తి ఉందని పేర్కొన్నారు.
అందుకే వివిధ ఆలయాలను దర్శించడంతోపాటు అనేక గ్రంథాలను చదివి విశ్వంలో మనిషి మనుగడకు ఉన్న నిజమైన అర్థాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. చంద్రయాన్-3లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. వాటి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని, రాబోయే రోజుల్లో వివిధ మోడల్‌లలో రెండింటి పనితీరును పరీక్షించాల్సి ఉందని, అప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టగలమని సోమనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్-3 విజయంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో కేంద్రాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ (PM Modi) శనివారం నేరుగా బెంగళూరులోని ఇస్రో ఇస్ట్రాక్ కార్యాలయాన్ని సందర్శించారు. వేదికపై ‘జై జవాన్, జై కిసాన్’తో పాటు ‘జై విజ్ఞాన్.. జై అనుసంధాన్’ అని నినదించారు. అనంతరం పీణ్యాలోని ఇస్రో కార్యాలయానికి చేరుకుని శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందించారు.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply