ఆరంభ నష్టాల నుంచి బౌన్స్‌ బ్యాక్‌, తొలి గంటలో పుంజుకున్న మార్కెట్లు

[ad_1]

Share Market Opening on 30 October 2023: గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్ ఈ వారం ఒత్తిడితో ప్రారంభమైంది. ప్రధాన దేశీయ సూచీలు BSE సెన్సెక్స్‌, NSE నిఫ్టీ ఈ రోజు (సోమవారం, 30 అక్టోబర్‌ 2023) నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించినా, మొదటి గంట ముగిసేసరికి ఆ నష్టాలను పూర్తిగా కవర్‌ చేశాయి.

ప్రీ-ఓపెన్ సెషన్‌లో, దేశీయ మార్కెట్లు ఒత్తిడిని కొనసాగించే సంకేతాలు చూపాయి. మార్కెట్ ప్రారంభానికి ముందు, ప్రీ-ఓపెన్ సెషన్‌లో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా బలంగా ఉంది, నిఫ్టీ కూడా గ్రీన్‌లో ట్రేడయింది. అయితే మార్కెట్ ప్రారంభమైన వెంటనే రెండు సూచీల లాభాలు పరిమితమయ్యాయి. సెన్సెక్స్ కేవలం 22 పాయింట్ల లాభంతో ప్రారంభమై నిమిషాల వ్యవధిలోనే నష్టాల్లోకి వెళ్లింది. నిఫ్టీ కూడా కేవలం 06 పాయింట్ల లాభంతో 19,053 వద్ద స్టార్టయింది, ఇది కూడా ఆ వెంటనే రెడ్‌ జోన్‌లోకి వెళ్లింది.

ఉదయం 10.40 గంటలకు BSE 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 06 పాయింట్ల లాభంతో 63,788 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ప్రారంభ సెషన్‌లో, ఒక దశలో సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ ఫ్లాట్‌గా 02 పాయింట్ల గ్రీన్‌తో 19,049 వద్ద కదులుతోంది. 

గత వారం పరిస్థితి ఇది
గత వారం చివరి రోజైన శుక్రవారం నాడు, మార్కెట్‌లో మంచి రికవరీ జరిగింది. అంతకుముందు వరుసగా ఏడు రోజులు మార్కెట్ పతనమైంది. గ్లోబల్ మార్కెట్ ఒత్తిళ్లు, ఎఫ్‌పీఐల నిరంతర విక్రయాలు, రెండో త్రైమాసికంలో కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం, అమెరికాలో ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్‌ రికార్డు స్థాయిలో పెరగడం వంటివన్నీ కలిసి దేశీయ మార్కెట్‌ను దిగజార్చాయి. ఏడు రోజుల్లో సెన్సెక్స్ & నిఫ్టీ తలో 3 శాతానికి పైగా క్షీణించాయి.

అయితే, శుక్రవారం ఏడు రోజుల మార్కెట్ క్షీణతకు అడ్డుకట్ట పడింది. శుక్రవారం నాడు, సెన్సెక్స్ & నిఫ్టీలలో ఒక్కొక్కటి 1 శాతం పైగా పెరిగాయి. సెన్సెక్స్ 634.65 పాయింట్లు లేదా 1.01 శాతం బలపడి 63,885.56 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 1.01 శాతం లాభంతో 18,857.25 పాయింట్ల వద్ద ఆగింది.

కొనసాగుతున్న ప్రపంచ మార్కెట్ల ఒత్తిడి
గ్లోబల్ మార్కెట్లు ఇప్పటికీ ఒత్తిడిలోనే ఉన్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్‌పై ఒత్తిడి నెలకొంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.12 శాతం క్షీణించింది. నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్‌ 0.38 శాతం పెరిగింది. S&P 500 0.48 శాతం నష్టపోయింది. ఈ రోజు ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. జపాన్‌ నిక్కీ 1.23 శాతం, హాంకాంగ్‌ హ్యాంగ్‌సెంగ్‌ 0.39 శాతం క్షీణించాయి.

నష్టాల్లో పెద్ద షేర్లు
మన మార్కెట్‌లో, ఈ రోజు ప్రారంభ సెషన్‌లో చాలా పెద్ద కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ 30లోని 20 షేర్లు లాస్‌తో ఓపెన్‌ అయ్యాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మహీంద్ర & మహీంద్ర షేర్లు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పడిపోయాయి. టైటన్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ వంటి పెద్ద పేర్లు కూడా పతనమయ్యాయి. మరోవైపు… Q2 ఫలితాల బలంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 2 శాతం పుంజుకుంది. టెక్ మహీంద్ర, మారుతి సుజుకీ వంటి షేర్లు కూడా ఓపెనింగ్‌ సెషన్‌లో గ్రీన్‌లో ఉన్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తగ్గిన గోల్డ్‌ రేటు – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *