ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మైక్రోసాఫ్ట్ బాస్ కీలక కామెంట్స్.. ChatGPTకి సమీప ప్రత్యర్థి ఏదంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


AI:

ChatGPT
తరహా
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
విభాగంపై
IT
దిగ్గజ
సంస్థ
మైక్రోసాఫ్ట్
ప్రెసిడెంట్
బ్రాడ్
స్మిత్
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
చైనాకు
చెందిన
పరిశోధనా
సంస్థలు
మరియు
కంపెనీలు..
ChatGPTకి
ప్రధాన
ప్రత్యర్థులుగా
ఎదుగుతాయని
హెచ్చరించినట్లు
ప్రముఖ
వార్తా
సంస్థ
నివేదించింది.
కాగా
AI
ఆధారిత
చాట్‌
బాట్
డెవలపర్
OpenAIలో

టెక్
దిగ్గజం
అతిపెద్ద
పెట్టుబడిదారుగా
ఉందన్న
విషయం
గమనార్హం.


మీడియా
సంస్థ
కథనం
ప్రకారం..
ఉత్పాదక
AI
అభివృద్ధిలో
అమెజాన్,
గూగుల్
వంటి
US
టెక్నాలజీ
దిగ్గజాల
మధ్య
విపరీతమైన
పోటీ
నెలకొంది.
అయితే

విషయంలో
చైనా
పెద్దగా
ఏమీ
వెనుకబడి
లేదని
మైక్రోసాఫ్ట్
బాస్
అభిప్రాయపడ్డారు.
టోక్యోలో
నిక్కీ
ఆసియాకు
ఇచ్చిన
ఇంటర్వ్యూలో
ఆయన

మేరకు
స్పందించారు.
AI
విషయానికి
వస్తే..
మైక్రోసాఫ్ట్
OpenAI,
గూగుల్,
బీజింగ్
అకాడమీ
ఆఫ్
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
మూడూ
ముందంజలో
ఉన్నట్లు
పేర్కొన్నారు.
కేవలం
నెలల
వ్యవధి
మాత్రమే
బేధం
ఉంటుందన్నారు.

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మైక్రోసాఫ్ట్ బాస్ కీలక కామెంట్

ChatGPT
వెనుక
ఉన్న
సాంకేతికత
జనరేటివ్
AI..
అధునాతన
స్థాయిలో
టెక్స్ట్
మరియు
ఇమేజ్‌లను
ఉత్పత్తి
చేయగలదు.
వ్యాపారం,
కళలు,
విద్య,
ఆరోగ్య
సంరక్షణ
రంగాల్లో
దాని
సామర్థ్యంతో
ప్రపంచాన్ని
ఆశ్చర్యపరిచింది.
కానీ
అనేక
ఉద్యోగాలను
ఆటోమేట్
చేయడం
ద్వారా
ప్రస్తుత
కార్మికులను
నిరుద్యోగం
వైపు
నెట్టివేస్తుందనే
భయాందోళనలను
రేకెత్తించినట్లు
నిపుణులు
చెబుతున్నారు.
ఇదే
కాక
తప్పుడు
సమాచారాన్ని
వ్యాప్తి
చేయడం,
కాపీరైట్‌
ఉల్లంఘన,
గోప్యతలో
ఇబ్బందులు,
సున్నితమైన
సమాచారాన్ని
లీక్
చేయడం
వంటి
చర్యలకు
పాల్పడే
అవకాశమూ
లేకపోలేదంటున్నారు.


తరహా
ఆందోళనలకు
పరిష్కారం
ఆవిష్కరణలను
ఆపడం
కాదని,
ఇప్పటికే
ఉన్న
ఉత్పత్తులను
ఉపయోగించడంతో
పాటు
మెరుగుపరచడమని
బ్రాడ్
స్మిత్
వ్యాఖ్యానించారు.
ఇతర
సాంకేతిక
పరిజ్ఞానాల
మాదిరిగానే
AI
కూడా
సైబర్
దాడులు
వంటి
సమస్యలను
ఎదుర్కోవడానికి

సాధనంగా,
ఆయుధంగా
ఉపయోగపడుతుందన్నారు.
ఆసియా
ఎదుర్కొంటున్న
అతిపెద్ద
సవాళ్లలో
ఒకటైన
కార్మికుల
కొరతను

సాంకేతికత
పరిష్కరించగలదని
భావిస్తున్నట్లు
చెప్పారు.

English summary

Microsoft President comments on closest ChatGPT rivals

Microsoft president on AI

Story first published: Saturday, April 22, 2023, 20:05 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *