ఆర్బీఐ రెపోరేట్లు పెంచుతుంటే.. ఈ బ్యాంకేమో వడ్డీరేట్లు తగ్గించింది!

[ad_1]

Canara Bank: 

కెనరా బ్యాంకు ఓ అనూహ్య నిర్ణయం తీసుకొంది. కస్టమర్లను ఆకర్షించేందుకు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం ఆర్బీఐ వరుసగా రెపోరేట్లు పెంచుతోంది. తాజాగా 25 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి తరుణంలో కెనరా వడ్డీలో రాయితీ కల్పిస్తుండటం ప్రత్యేకం.

రెపో అనుసంధాన రుణాల రేటు (RLLR)ను 15 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నామని కెనరా బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. తగ్గించిన వడ్డీరేట్లు ఫిబ్రవరి 12 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ‘రెపో లింకుడ్‌ లెండింగ్‌ రేటుకు అనుసంధానపై రిటైల్‌ రుణాల వడ్డీరేట్లు 12-02-202 నుంచి 9.25 శాతంగా ఉంటాయి’ అని కెనరా బ్యాంకు పేర్కొంది. కాగా ఆర్బీఐ రెపోరేటును పెంచగానే ఈ బ్యాంకు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ వడ్డీ రేటును 9.4 శాతానికి సవరించడం గమనార్హం.

ప్రస్తుతం 9.25 శాతంగా ఉన్న గృహరుణాలపై వడ్డీరేటుపై 0.25 శాతం రాయితీ అందిస్తోంది. తక్కువ రిస్క్‌ ప్రొఫైల్‌ కలిగిన రుణ గ్రహీతలకు ఇది వర్తిస్తుంది. తక్కువ నష్టభయం కలిగిన, 01-01-23 నుంచి 31-03-2023 మధ్య రుణాలు మంజూరైన వారికి వర్తిస్తుంది. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌పై క్రెడిట్‌ రిస్క్‌ను బట్టి గృహరుణాలపై వడ్డీరాయితీ అందిస్తోంది.

ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌పై క్రెడిట్‌ రిస్క్‌ ప్రీమియం

మహిళా రుణ గ్రహీత క్రెడిట్‌ రిస్క్‌ జీరో అయితే వారికి అమలయ్యే వడ్డీరేటు 9 శాతమే. ఇతరులకు 9.05 శాతం.
మహిళా రుణ గ్రహీత క్రెడిట్‌ రిస్క్‌ 0.05 శాతం అయితే వారికి అమలయ్యే వడ్డీరేటు 9.30 శాతం. ఇతరులకు 9.35 శాతం.
మహిళా రుణ గ్రహీత క్రెడిట్‌ రిస్క్‌  0.45 శాతం అయితే వారికి వర్తించే వడ్డీరేటు 9.70 శాతం. ఇతరులకు 9.75 శాతం.
మహిళా రుణ గ్రహీత క్రెడిట్‌ రిస్క్‌ 1.95 శాతం అయితే వారికి వర్తించే వడ్డీరేటు 11.20 శాతం. ఇతరులకు 11.25 శాతం.

కెనెరా బ్యాంకు షేరు నేడు రూ.293 వద్ద మొదలైంది. రూ.284 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. రూ.295 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు రూ.8.20 నష్టంతో రూ.285.70 వద్ద కొనసాగుతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

 



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *