‘ఆ సమయంలో ఆమె నాకు కొండంత అండగా నిలిచారు’ – రాధిక మర్చంట్ పై అనంత్ అంబానీ ప్రశంసల జల్లు

[ad_1]

Anant Ambani Said Radhika Marchant As ‘Person of My Dreams’: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ (Anant Ambani), తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్ (Radhika Merchant)పై ప్రశంసల జల్లు కురిపించారు. తాను అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో రాధికా మర్చంట్ ఎంతో అండగా నిలిచారని అనంత్ అంబానీ వెల్లడించారు. ఆ సమయంలో ఆమె స్థిరంగా తన వైపు నిలబడ్డారని కొనియాడారు. ‘నా జీవితంలో ఆమె ఉండడం నా అదృష్టం. ఆమె నా కలల రాణి. ఎప్పుడూ మూగ జీవాల సంరక్షణ గురించి ఆలోచించే నేను.. వైవాహిక జీవితంలోకి అడుగు పెడతానని అనుకోలేదు. కానీ రాధికను కలిసిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది. ఆమె మూగ జీవాల పట్ల దయతో ఉంటారు. నేను ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమె నాకు కొండంత అండగా నిలిచింది. ఆమె మద్దతుతోనే నేను అనారోగ్య సమస్యలపై బలంగా పోరాడగలిగాను’ అని రాధికపై తన ప్రేమను వ్యక్తం చేశారు. కాగా, అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచీ ఊబకాయంతో బాధ పడుతున్నారు. తన కుమారుడికి ఆస్థమా ఉండడంతో బరువు తగ్గడం చాలా కష్టంగా మారిందని గతంలో నీతా అంబానీ వెల్లడించారు. 

‘జూమ్ నగర్ ఎందుకంటే.?’

ఇక, ప్రీ వెడ్డింగ్ వేడుకలపైనే అందరి దృష్టి పడింది. 3 రోజుల సంబరాలకు అంతర్జాతీయ అతిథులు హాజరవుతున్నారు. ఈ ఈవెంట్స్ కు గుజరాత్ లోని జూమ్ నగర్ ఎంచుకోవడం ఆసక్తిగా మారిన నేపథ్యంలో అనంత్ అంబానీ స్పందించారు. ‘నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఇక్కడ వేడుక జరుగుతుండడం నా అదృష్టం. ఇది మా నానమ్మ జన్మభూమి. మా తాతయ్య, నాన్న కర్మభూమి. ఇది మీ తాతయ్య అత్తిల్లు అంటూ మా నాన్న తరచూ చెప్తుండేవారు. భారత్ లోనే వివాహాలు చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినప్పుడు నాకు ఎంతో గర్వంగా అనిపించింది. ఇది నా ఇల్లు.’ అంటూ అనంత్ వెల్లడించారు.

ఈ వేడుకలు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, నటులు దాదాపు 1000 మందికి పైగా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఈగర్ ఇతర ప్రముఖులు సహా ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రజినీ కాంత్ సహా ఇతర ముఖ్యులూ హాజరు కానున్నారు. అతిథులకు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫాస్ట్ లో 75 వెరైటీలు, లంచ్ లో 225, డిన్నర్ లో 275 రకాల వంటకాలను వడ్డించనున్నారు. భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ ఇలా పలు సంప్రదాయ వంటలను రుచి చూపించనున్నారు. 

Also Read: March 1st New Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్ – ఈ విషయాలు తెలుసుకోండి, లేకుంటే?

 

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *