[ad_1]
ఎలాంటి ఫుడ్..
ముందుగా మనం ఏం తింటామో, ఎలా తింటామో తెలుసుకోవాలి. పెద్దలు మాత్రమే కాదు, పిల్లలు కూడా ఏం తినాలో వారికి తెలియజేయాలి. ఎందుకంటే, నేటి కాలంలో 10 ఏళ్ళ పిల్లలు కూడా అధిక బరువుతో కూడా బాధపడుతున్నారు. పిల్లలకి జంక్ ఫుడ్ తినాలని ఉంటుంది. కానీ, వారికి అడిగినవన్నీ ఇవ్వకూడదు. దీంతో త్వరగా బరువు పెరుగుతారు.
ఏం తినాలి..
మనం నేడు తింటున్న ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నం అన్నింటిలోనూ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అందుకే, వాటి బులు మిల్లెట్స్, చిరు ధాన్యాలు, బ్రౌన్ రైస్ వంటివి తినాలి.
కార్బోహైడ్రేట్స్‌ని 30 నుండి 40 శాతం తగ్గించడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించండి. ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్ తీసుకోండి. ఆయిల్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.
వేరుశనగ, కాయలు, విత్తనాలు, మొలకెత్తిన పప్పులు, ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, తీసుకోవాలి.
Also Read : Curd in Summer : పెరుగు రోజూ తింటున్నారా.. ఈ సమస్యలొస్తాయట..
ఆహారం, జీర్ణవ్యవస్థతో సంబంధం..
ఆహారం అనేది జీర్ణవ్యవస్థకి సంబంధించింది. మీరు మీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఉదయం 7, 8కి తీసుకుంటే రాత్రి డిన్నర్‌ని 8 గంటలకి పూర్తి చేయాలి. ఆ తర్వాత నీరు మాత్రమే తీసుకోవాలి. ఆకలిగా ఉంటే పండ్లు తీసుకోవచ్చు. తర్వాత 12 గంటల పాటు మీ కడుపుకి రెస్ట్ ఇవ్వండి. ఇది చాలు. దీంతో శరీర బరువు తగ్గుతుంది. షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ కూడా హెల్దీగా ఉంటుంది.
రాత్రి డిన్నర్ ఎలా ఉండాలంటే..
చాలా మంది నేటి కాలంలో రాత్రి డిన్నర్ 10, గంటల తర్వాత తింటారు. మళ్ళీ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటారు. దీంతో జీర్ణ వ్యవస్థకి అస్సలు గ్యాప్ ఉండదు. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌ని 12 గంటల పాటు గ్యాప్ ఇచ్చాక తీసుకోండి. కానీ, ప్రతిసారి ఇలానే వద్దు. ఎంత త్వరగా డిన్నర్ ఫినిష్ చేస్తే అంత త్వరగా కంప్లీట్ చేయండి. డిన్నర్ చేశాక వెంటనే నిద్రపోవద్దు.అలా చేస్తే పొట్ట, పేగుల్లో గ్యాస్ పేరుకుపోతుంది. అందుకే డిన్నర్ అయ్యాక 2 గంటలు రెస్ట్ తీసుకుని నిద్రపోవడం మంచిది.
ఎలా వండాలి..
ఎక్కువగా ఫుడ్ తీసుకోవద్దు.
బయటి ఆహారం తినడం
చక్కగా శుభ్రం చేసిన పదార్థాలతోనే వంట చేయాలి.
కూరగాయలు, మాంసం సరిగ్గా ఉండికించకపోయినా అది ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది.
నేటి కాలంలో ఆహారం, కూరగాయలు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండేందుకు పురుగు మందు కలుపుతున్నారు.
అందుకే వాటిని బాగా క్లీన్ చేసి వండడం మంచిది.
ఇవి మరువొద్దు..
Also Read : ఆ ప్రాంతాన్ని సబ్బుతో క్లీన్ చేస్తున్నారా.. జాగ్రత్త..
ప్రతి వ్యక్తి తన బాడీని బట్టి ఆహారాన్ని తీసుకోవాలి. ఉదహారణకి గౌట్ సమస్య ఉన్నవారు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. షుగర్ పేషెంట్స్ కార్బోహైడ్రేట్స్‌కి దూరంగా ఉండాలి.
ఆకలిగా ఉన్నప్పుడు దోసకాయ, క్యారెట్, వెజిటేబుల్ సలాడ్ తీసుకోవచ్చు. కానీ, బిస్కెట్స్ వంటివి వద్దు.
హెల్దీ ఫుడ్ తీసుకోవడం
సరైన వర్కౌట్ వంటి వాటి వల్ల జీర్ణ వ్యవస్థని హెల్దీగా ఉంచుకోవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Health News and Telugu News
[ad_2]
Source link
Leave a Reply