[ad_1]
Stocks to watch today, 20 December 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 38 పాయింట్లు లేదా 0.21 శాతం గ్రీన్ కలర్‌లో 18,448 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టెలికాం స్టాక్స్: అక్టోబర్ నెలలో వొడాఫోన్ ఐడియా పెద్ద సంఖ్యలో మొబైల్ కస్టమర్లను కోల్పోయింది. దీంతో, దేశంలో టెలికాం సబ్‌స్క్రైబర్ బేస్ 117 కోట్లకు తగ్గిందని ట్రాయ్ నివేదికలో వెల్లడైంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ మాత్రమే అక్టోబర్‌లో కొత్త కస్టమర్లను చేర్చుకున్నాయి.
HDFC: తనఖా లీడర్ తన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటులో 35 బేసిస్ పాయింట్ల పెరుగుదలను ప్రకటించింది. ఇప్పుడు కనీస రేటు 8.65 శాతంగా ఉంది. సవరించిన రేట్లు మంగళవారం (20.12.20222) నుంచి అమలులోకి వచ్చాయి. మే నుంచి HDFC రుణాల రేటు 225 bps పెంచింది.
News Reels
డాబర్ ఇండియా: బర్మన్ కుటుంబానికి చెందిన డాబర్ ఇండియా, మంగళవారం బ్లాక్ డీల్ ద్వారా రూ.800 కోట్ల విలువైన వాటాలను విక్రయించాలని చూస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి దాదాపు 4% డిస్కౌంట్‌లో షేర్లను ప్రమోటర్లు అమ్మే అవకాశం ఉంది.
IRCTC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది అక్టోబర్ 17 – డిసెంబర్ 16 తేదీల మధ్య, ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఈ రైల్వే సంస్థలో మరో 2.27 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో, IRCTCలో LIC వాటా 5.005 శాతం నుంచి 7.278 శాతానికి పెరిగింది.
ఇప్కా లేబొరేటరీస్: న్యూట్రిచార్జ్ బ్రాండ్ పేరుతో వివిధ SKUల న్యూట్రాస్యూటికల్స్ తయారీ, మార్కెటింగ్ బిజినెస్‌లో ఉన్న ట్రోఫిక్ వెల్‌నెస్‌లో (TWPL) ఇప్కా లేబొరేటరీస్ మరో 6.53 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ షేర్లతో, కంపెనీ ఇప్పుడు TWPLలో 58.88 శాతం వాటాను కలిగి ఉంది.
స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ: ప్రమోటర్లు షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ, ఖుర్షెద్ యాజ్ది దరువాలా ఒక కోటి ఈక్విటీ షేర్లను లేదా 5.27 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్ ద్వారా ఒక్కొక్కటి రూ. 270 ఫ్లోర్ ధరకు విక్రయించబోతున్నారు.
జస్ట్ డయల్: ప్రమోటర్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్, గరిష్టంగా 75% హోల్డింగ్ మాత్రమే ఉండాలన్న నిబంధనలకు అనుగుణంగా ఈ నెలాఖరులోగా జస్ట్ డయల్‌లో 2% వాటాను బహిరంగ మార్కెట్ ద్వారా విక్రయించాలని యోచిస్తోంది.
IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్: ఒక్కొక్కటి రూ. 10 ముఖ విలువ కల ఈక్విటీ షేర్ల విభజన ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ కంపెనీ బోర్డు 2023 జనవరి 4న సమావేశం కానుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply