ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – నేడు లిస్ట్‌ కానున్న Radiant Cash

[ad_1]

Stocks to watch today, 04 January 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 52 పాయింట్లు లేదా 0.28 శాతం రెడ్‌ కలర్‌లో 18,254 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్: ఈ కంపెనీ షేర్లు ఇవాళ (బుధవారం, 04 జనవరి 2023‌) స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కానున్నాయి. గ్రే మార్కెట్‌లోని ట్రెండ్‌ను బట్టి, ఇష్యూ ధర రూ. 99 కంటే ప్రీమియంతో స్టాక్‌ లిస్ట్ కావచ్చని అర్ధం అవుతోంది. గ్రే మార్కెట్‌లో మార్కెట్‌లో, ఒక్కో షేరు రూ. 7 ప్రీమియంతో ట్రేడవుతోంది.

అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ( D-Mart): తాత్కాలిక గణాంకాల ప్రకారం…  2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ ఆదాయంలో రెండంకెల పెరుగుదల కనిపిస్తున్నా, QoQ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి మందగించింది. 2022 అక్టోబర్- డిసెంబర్‌లో ఆదాయం సంవత్సరానికి (YoY) 25% పెరిగి రూ. 11,305 కోట్లకు చేరుకుంది.

live reels News Reels

Reliance Industries: రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌ లిమిటెడ్‌ (Reliance Retail Ventures Ltd) FMCG విభాగమైన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, గుజరాత్‌కు చెందిన Sosyo Hajoori Beverages Private Limitedలో (SHBPL) 50% వాటాను కొనుగోలు చేయనుంది. ‘Sosyo’ బ్రాండ్‌ పేరిట ఈ కంపెనీ పానీయాల వ్యాపారం చేస్తోంది. 

వేదాంత: కాల్సినర్స్‌లో నిర్వహణ పనుల కారణంగా లాంజిగర్ రిఫైనరీలో అల్యూమినా ఉత్పత్తి Q3FY23లో 6% YoY &  2% QoQ తగ్గి 4,43,000 టన్నులకు చేరింది. అధిక ఓర్‌ ఉత్పత్తి కారణంగా తవ్విన లోహాలు YoYలో 1% పెరిగి 2,54,000 టన్నులుగా ఉంది. అంతర్జాతీయ వ్యాపారంలో మొత్తం జింక్ ఉత్పత్తి 32% YoY పెరిగింది.

హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ‍‌(HDFC): 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో, HDFC బ్యాంక్‌కు రూ. 8,892 కోట్ల రుణాలను HDFC కేటాయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ. 7,468 కోట్లుగా ఉంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో, డివిడెండ్ ద్వారా వచ్చిన స్థూల ఆదాయం ఏడాది క్రితంలో నమోదైన రూ.195 కోట్లతో పోలిస్తే ఈసారి రూ. 482 కోట్లుగా ఉంది.

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్/ స్పైస్‌జెట్: ఎయిర్‌లైన్ రంగంలో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 2022 డిసెంబర్‌ నెలలో ప్రి-కోవిడ్ స్థాయిని దాటి, 1.29 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ 2019లో దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ 1.26 కోట్లుగా ఉంది.

రిలయన్స్ క్యాపిటల్: రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రక్రియ మీద NCLT ముంబై బెంచ్ స్టే ఇచ్చింది. టోరెంట్ గ్రూప్ అభ్యర్థనతో రిజల్యూషన్ ప్రక్రియను నిలిపివేసింది. హిందూజా గ్రూప్‌, సవరించిన బిడ్‌ను దాఖలు చేయడంతో, దాన్ని సవాలు చేస్తూ టోరెంట్ గ్రూప్‌ NCLT ముంబై బెంచ్‌ను ఆశ్రయించింది.

IIFL ఫైనాన్స్: సెక్యూర్డ్‌ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (NCD) పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ రూ. 1,000 కోట్ల వరకు సమీకరించనుంది. ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను వ్యాపార వృద్ధికి వినియోగిస్తామని IIFL ఫైనాన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పబ్లిక్ ఇష్యూ 2023 జనవరి 6న ప్రారంభమై జనవరి 18న ముగుస్తుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *