[ad_1]
Stocks to watch today, 15 February 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 37 పాయింట్లు లేదా 0.21 శాతం రెడ్ కలర్‌లో 17,890 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
వొడాఫోన్ ఐడియా: 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా ఏకీకృత నికర నష్టం ఏడాది ప్రాతిపదికన భారీగా పెరిగి రూ. 7,990 కోట్లకు చేరింది. ఏకీకృత ఆదాయం 9.3% పెరిగి రూ. 10,621 కోట్లకు చేరుకుంది.
బయోకాన్: డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 42 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది, అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో రూ. 187 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
ONGC: డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 26% పెరిగి రూ. 11,045 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు 36% పెరిగి రూ. 38,583 కోట్లకు చేరుకుంది.
అపోలో హాస్పిటల్స్: 2022-23 మూడో త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ ఏకీకృత పన్ను తర్వాతి లాభం రూ. 162 కోట్లుగా నమోదైంది, ఏడాది క్రితం ఇదే కాలం కంటే 33% తగ్గింది. కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 17% పెరిగి రూ. 4,263 కోట్లకు చేరుకుంది.
గ్రాసిమ్: డిసెంబర్ త్రైమాసికంలో ఈ సంస్థ ఏకీకృత నికర లాభం రూ. 2,516 కోట్లకు చేరి, 44% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17% పెరిగి రూ. 28,638 కోట్లకు చేరుకుంది.
PI ఇండస్ట్రీస్: ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో PI ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం రూ. 351 కోట్లు కాగా, కార్యకలాపాల ద్వారా రూ. 1,613 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 4.5 మధ్యంతర డివిడెండ్‌ను ఈ కంపెనీ ప్రకటించింది
NMDC: డిసెంబర్ త్రైమాసికంలో ఎన్‌ఎండీసీ రూ. 904 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 3,720 కోట్లుగా ఉంది. ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ. 3.75 డివిడెండ్‌ను కూడా కంపెనీ ప్రకటించింది.
NBCC (ఇండియా): డిసెంబర్ త్రైమాసికానికి రూ. 69 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, గత ఏడాది ఇదే కాలంలోని రూ. 82 కోట్ల కంటే తగ్గింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 2,136 కోట్ల ఆదాయం వచ్చింది.
బాటా ఇండియా: మూడో త్రైమాసికంలో రూ. 83 కోట్ల నికర లాభాన్ని, రూ. 900 కోట్ల ఆదాయాన్ని బాటా ఇండియా ఆర్జించింది. రిపోర్టింగ్ కాలంలో కంపెనీ EBITDA రూ. 206 కోట్లుగా ఉంది.
టొరెంట్ పవర్: డిసెంబర్ త్రైమాసికంలో రూ. 685 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, ఏడాది ప్రాతిపదికన ఇది 86% పెరిగింది. కార్యకలాపాల ద్వారా రూ. 6,443 కోట్ల ఆదాయం వచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply