ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – ఫోకస్‌లో HUL, Adani Wilmar

[ad_1]

Stocks to watch today, 20 February 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 28 పాయింట్లు లేదా 0.16 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,965 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

KEC ఇంటర్నేషనల్: గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ EPC మేజర్ అయిన KEC ఇంటర్నేషనల్, తన వివిధ వ్యాపారాలకు సంబంధించి రూ. 3,023 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌లను పొందింది.

రైట్స్‌ (RITES): సర్క్యూట్ నిరంతర పర్యవేక్షణ, ఇతర అనుబంధ పనులు సహా EI ఆధారిత ఆటోమేటిక్ సిగ్నలింగ్‌ను అందించడం కోసం RITES రూ. 76 కోట్ల కొత్త EPC ఆర్డర్‌ దక్కించుకుంది.

HUL: గోధుమపిండి, ఉప్పు ఆహార పదార్థాల కేటగిరీల్లోని తన “అన్నపూర్ణ”, “కెప్టెన్ కుక్” బ్రాండ్‌ల విక్రయానికి ఉమా గ్లోబల్ ఫుడ్స్‌తో (Uma Global Foods) రూ. 60.4 కోట్లకు ఖచ్చితమైన ఒప్పందాలను హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) కుదుర్చుకుంది.  

సిప్లా: అమెరికన్‌ హెల్త్ రెగ్యులేటర్ US FDA పితంపూర్ తయారీ కేంద్రంలో తనిఖీని నిర్వహించిన తర్వాత, 8 పరిశీలనలను (inspectional observations) సిప్లా అందుకుంది.

పెన్నార్ ఇండస్ట్రీస్‌: వాల్యూ యాడెడ్ ఇంజినీరింగ్ ప్రొడక్ట్స్‌ & సొల్యూషన్స్ కంపెనీ అయిన పెన్నార్ గ్రూప్, తన వివిధ వ్యాపార విభాగాలకు సంబంధించి రూ. 851 కోట్ల విలువైన ఆర్డర్‌లను పొందింది.

యునైటెడ్ బ్రూవరీస్: యునైటెడ్ బ్రూవరీస్ MD & CEO రిషి పర్డాల్ తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీకి కొత్త MD & CEO కోసం బోర్డు అన్వేషణ ప్రారంభించింది.

జైడస్ లైఫ్ సైన్సెస్: అమెరికాలో సిరోలిమస్ టాబ్లెట్‌లను మార్కెట్ చేయడానికి US హెల్త్ రెగ్యులేటర్ నుంచి జైడస్ లైఫ్‌సైన్సెస్ అనుమతి పొందింది. మూత్రపిండ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్న 13 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల్లో శరీర తిరస్కరణను అడ్డుకోవడానికి ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు.

అదానీ విల్మార్: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) ప్రధాన సూచికలను రీషఫుల్‌ చేసింది. తద్వారా… నిఫ్టీ నెక్ట్స్‌ 50 & నిఫ్టీ 100 ఇండెక్సుల్లో అదానీ విల్మార్ భాగం అవుతుంది.

అదానీ పవర్: NSE సూచీల రీషఫుల్‌లో భాగంగా… నిఫ్టీ 500, నిఫ్టీ 200, నిఫ్టీ మిడ్‌ క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌ క్యాప్ 150, నిఫ్టీ లార్జ్ మిడ్‌ క్యాప్ 250, నిఫ్టీ మిడ్ స్మాల్ క్యాప్ 400 సూచీల్లో అదానీ పవర్ భాగం అవుతుంది.

UPL: ఇండియా అగ్రిటెక్‌ ఫ్లాట్‌ఫాం UPL SASలో ADIA, TPG, బ్రూక్‌ఫీల్డ్ ద్వారా రూ. 1,580 కోట్ల (200 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడిని పూర్తి చేసినట్లు UPL ప్రకటించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *