[ad_1]
Stocks to watch today, 31 March 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 6 పాయింట్లు లేదా 0.03 శాతం రెడ్ కలర్లో 17,253 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్/పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
హీరో మోటోకార్ప్: నిరంజన్ గుప్తాను కంపెనీకి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) హీరో మోటోకార్ప్ నియమించింది. ఇది మే 1, 2023 నుంచి అమలులోకి వస్తుందిత. ప్రస్తుతం కంపెనీ CFOగా, స్ట్రాటజీ, M&A హెడ్‌గా పని చేస్తున్న గుప్తాను CEO స్థానానికి బోర్డ్ ప్రమోట్ చేసింది.
విప్రో: APMEA (ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఇండియా, ఆఫ్రికా) వ్యూహాత్మక మార్కెట్ యూనిట్ కింద, భారతదేశం & ఆగ్నేయాసియా వ్యాపారాలకు బద్రి శ్రీనివాసన్ నాయకత్వ బాధ్యతలను విప్రో అందించింది.
లుపిన్: లుపిన్కు చెందిన పితంపూర్ యూనిట్-2 తయారీ కేంద్రాన్ని US FDA తనిఖీ చేసింది, పది పరిశీలనలను (observations) జారీ చేసింది.
అలెంబిక్ ఫార్మా: ఈ కంపెనీ కొత్త డ్రగ్ ‘బ్రైమోనైడైన్ టార్ట్రేట్ ఆప్తాల్మిక్ సొల్యూషన్’ కోసం US FDA నుంచి తుది ఆమోదం పొందింది.
BEL: దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచే ఉత్పత్తుల కోసం, భారత్ ఎలక్ట్రానిక్స్‌తో రూ. 2,696 కోట్ల విలువైన రెండు ఒప్పందాలపై రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) సంతకం చేసింది.
అరబిందో ఫార్మా: కాబోటెగ్రావిర్ టాబ్లెట్లు, లాంగ్ యాక్టింగ్ ఇంజెక్టబుల్స్‌ను అభివృద్ధి చేయడం & మార్కెటింగ్ చేయడం కోసం UN సంస్థ అయిన మెడిసిన్స్ పేటెంట్ పూల్తో (MPP) వాలెంటరీ సబ్-లైసెన్సింగ్ ఒప్పందాన్ని అరబిందో ఫార్మా కుదుర్చుకుంది.
క్వెస్ కార్ప్: ప్రమోటర్ ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ (మారిషస్), క్వెస్ కార్ప్‌లో మరో 4.45% వాటాను కొనుగోలు చేసి, టోటల్ స్టేక్ పెంచుకుంది.
టాటా పవర్: మే 1 నుంచి మరో నాలుగేళ్ల పాటు కంపెనీ CEO & మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రవీర్ సిన్హాను కొనసాగించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఏంజెల్ వన్: ఇవాళ ఏంజెల్ వన్ షేర్లు ఎక్స్-డివిడెండ్‌తో ట్రేడ్ అవుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం ఈ కంపెనీ ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 9.6 చొప్పున నాలుగో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. షేర్ ధర ఈ మేరకు సర్దుబాటు అవుతుంది.
IGL: ఇంద్రప్రస్థ గ్యాస్ షేర్లు ఇవాళ ఎక్స్-డివిడెండ్‌ను ట్రేడ్‌తో ట్రేడ్ అవుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 10 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఈ కంపెనీ ప్రకటించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply