ఇవాళ్టి ట్రేడ్‌లో మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే స్టాక్స్‌ Airtel, Jindal Stainless, V-Mart

[ad_1]

Stock Market Today, 17 May 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 37 పాయింట్లు లేదా 0.20 శాతం రెడ్‌ కలర్‌లో 18,293 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: క్వెస్ కార్ప్, జిందాల్ స్టెయిన్‌లెస్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, దేవయాని ఇంటర్నేషనల్. ఈ షేర్లపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

ఎయిర్‌టెల్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 50% వృద్ధితో రూ. 3,006 కోట్లను భారతి ఎయిర్‌టెల్ ఆర్జించింది. ఏకీకృత ఆదాయం 14.3% YoY వృద్ధితో రూ. 36,009 కోట్లకు చేరుకుంది. జనవరి-మార్చి కాలంలో ఎయిర్‌టెల్‌ ఆర్పు (ARPU) ప్రత్యర్థి కంపెనీ రిలయన్స్‌ జియో ఆర్పు రూ. 178.8 కంటే మెరుగ్గా రూ. 193 వద్ద ఉంది. మార్చి త్రైమాసికంలో 3.1 మిలియన్ కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఎయిర్‌టెల్‌ జోడించింది. డిసెంబర్ త్రైమాసికంలోని 4.4 మిలియన్ల చేరికల కంటే ఇప్పుడు తక్కువగా ఉంది. ఒక్కో షేరుకు రూ. 4 తుది డివిడెండ్‌ చెల్లించాలని ఎయిర్‌టెల్‌ బోర్డు సిఫారసు చేసింది. 

జిందాల్ స్టీల్: జనవరి-మార్చి కాలంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఏకీకృత నికర లాభం 69% తగ్గి రూ. 462 కోట్లకు పరిమితం అయింది. రిపోర్టింగ్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 4% తగ్గి రూ. 13,691 కోట్లకు చేరుకుంది.

వి మార్ట్: Q4FY23లో వి మార్ట్ నికర నష్టం రూ. 37 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా రూ. 594 కోట్ల ఆదాయం వచ్చింది.

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్: 2022-23 నాలుగో త్రైమాసికంలో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 1,180 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే కాలానికి ఎన్‌ఐఐ రూ. 1,990 కోట్లుగా వచ్చింది.

ఒబెరాయ్ రియాల్టీ: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఒబెరాయ్ రియాల్టీ రూ. 480 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 961 కోట్లుగా ఉంది.

అంబర్ ఎంటర్‌ప్రైజెస్: జనవరి-మార్చి కాలానికి అంబర్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 104 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అదే కాలంలో ఆదాయం రూ. 3,002 కోట్లుగా ఉంది.

హీరో మోటోకార్ప్: ఈ టూ వీలర్‌ కంపెనీ సరికొత్త OBD-II, E20 కంప్లైంట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ XPulse 200 4 Valve లాంచ్‌ చేసింది, దీని ద్వారా ప్రీమియం పోర్ట్‌ఫోలియోను పెంచుకుంది.

త్రివేణి టర్బైన్: క్యూ4లో రూ. 55 కోట్ల నికర లాభాన్ని త్రివేణి టర్బైన్ మిగుల్చుకుంది. ఆ త్రైమాసికంలో ఆదాయం రూ. 370 కోట్లుగా ఉంది.

మెట్రోపొలిస్ హెల్త్‌కేర్: నాలుగో త్రైమాసికంలో మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ రూ. 33 కోట్ల నికర లాభాన్ని సాధించగా, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం స్వల్పంగా రూ. 282 కోట్లకు తగ్గింది.

పేటీఎం: సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భావేష్ గుప్తాను కంపెనీ ‘ప్రెసిడెంట్ అండ్‌ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్’గా పేటీఎం బోర్డ్ నియమించింది.

ఇది కూడా చదవండి: అంతర్జాతీయంగా పసిడి పతనం – ఇవాళ బంగారం, వెండి ధరలివి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *