ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ SBI, ITC, HDFC Bank

[ad_1]

Stock Market Today, 18 May 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 36 పాయింట్లు లేదా 0.19 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,268 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఇండిగో, SBI, ITC, గెయిల్ (ఇండియా), యునైటెడ్ స్పిరిట్స్. ఈ షేర్లపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

M M ఫోర్జింగ్స్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో M M ఫోర్జింగ్స్ నికర లాభం అనేక రెట్లు పెరిగి రూ. 30 కోట్లకు చేరుకుంది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం రూ. 387 కోట్లుగా ఉంది.

GIC హౌసింగ్ ఫైనాన్స్: 2022-23 నాలుగో త్రైమాసికంలో రూ. 52.3 కోట్ల నికర లాభాన్ని జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటించింది. ఆ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 281 కోట్లుగా ఉంది

షీలా ఫోమ్: 2023 జనవరి-మార్చి కాలంలో షీలా ఫోమ్ నికర లాభం 9% తగ్గి రూ. 45 కోట్లకు పరిమితమైంది. ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 729 కోట్ల ఆదాయం వచ్చింది.

JSW స్టీల్: మహారాష్ట్రలో అన్‌-ఎక్స్‌ప్లోర్డ్‌ ఇనుప ఖనిజం గని కాంపోజిట్‌ లైసెన్స్ కోసం ప్రాధాన్య బిడ్డర్‌గా JSW స్టీల్ నిలిచింది.

వేదాంత్ ఫ్యాషన్స్: వేదాంత్ ఫ్యాషన్స్ ప్రమోటర్ అయిన రవి మోదీ ఫ్యామిలీ ట్రస్ట్, ఈ కంపెనీలో 7% వరకు వాటాలను OFS ద్వారా విక్రయించాలని యోచిస్తోంది. ఒక్కో షేరు ధర రూ. 1,161 గా నిర్ణయించారు

రైల్‌టెల్ కార్పొరేషన్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 76 కోట్ల నికర లాభాన్ని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆర్జించింది. ఆ త్రైమాసికంలో సంస్థ కార్యకలాపాల ఆదాయం రూ. 703 కోట్లుగా ఉంది.

హనీవెల్ ఆటోమేషన్: 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో హనీవెల్ ఆటోమేషన్ నికర లాభం 112 రూపాయలుగా లెక్క తేలింది. అదే కాలంలో కంపెనీకి 850 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

JK టైర్: జనవరి-మార్చి కాలంలో రూ. 108 కోట్ల నికర లాభాన్ని JK టైర్ నమోదు చేసింది. ఇదే కాలంలో ఆదాయం రూ. 3,632 కోట్లుగా ఉంది.

REC: నాలుగో త్రైమాసికంలో REC నికర లాభంలో 33% వృద్ధిని సాధించి రూ. 3,065 కోట్లకు చేరుకుంది. అదే త్రైమాసికంలో ఆదాయం రూ. 10,243 కోట్లుగా ఉంది.

వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా: Q4FY23లో వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా రూ. 63 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. రూ. 1,672 కోట్ల ఆదాయం వచ్చింది.

GSK ఫార్మా: మార్చితో ముగిసిన త్రైమాసికంలో జీఎస్‌కే ఫార్మా రూ. 133 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. రిపోర్టింగ్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.787 కోట్లుగా ఉంది.

HDFC బ్యాంక్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 9.99% వరకు వాటాను కొనుగోలు చేయడానికి ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది.

జిందాల్ స్టెయిన్లెస్: నాలుగో త్రైమాసికంలో జిందాల్ స్టెయిన్‌లెస్ నికర లాభం రూ. 766 కోట్లు, ఇదే కాలానికి ఆదాయం రూ. 9,765 కోట్లుగా ఉంది.

హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్: నలుగురు హిందూజా సోదరులలో పెద్దవాడు, హిందూజా గ్రూప్ ఛైర్మన్ ఎస్పీ హిందూజా (87) లండన్‌లో మరణించారు.

ఇది కూడా చదవండి: పసిడి రేటు భారీగా పతనం – ఇవాళ బంగారం, వెండి ధరలు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *