ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Zomato, Airtel, SBI

[ad_1]

Stock Market Today, 04 August 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 31 పాయింట్లు లేదా 0.16 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,482 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ Q1 రిజల్ట్స్‌ ప్రకటించే కీలక కంపెనీలు: SBI, M&M, బ్రిటానియా, BHEL, డెలివెరి. ఈ స్టాక్స్‌ ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

జొమాటో: ఫుడ్‌ డెలివెరీ కంపెనీ జొమాటో మొట్టమొదటి లాభాన్ని రుచి చూసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో, ఈ కంపెనీ రూ. 2 కోట్లుగా నివేదించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 186 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. మొత్తం ఆదాయం రూ. 1,414 కోట్ల నుంచి 71% వృద్ధితో రూ. 2,416 కోట్లకు పెరిగింది.

ఎయిర్‌టెల్: ఎయిర్‌టెల్ ఏకీకృత నికర లాభం రూ. 1,612 కోట్ల వద్ద ఉంది, నైజీరియా కరెన్సీ విలువ తగ్గింపు కారణంగా అనూహ్యంగా నష్టపోయింది. 2022-23 ఇదే కాలంలోని లాభం రూ.1607 కోట్లతో పోలిస్తే, ఇది నామమాత్రంగా 0.3% ఎక్కువ. ఆదాయం మాత్రం రూ.32,805 కోట్ల నుంచి 14% గ్రోత్‌తో రూ.37,440 కోట్లకు చేరింది. ARPU రూ.183 నుంచి 12% పైగా పెరిగి రూ.200గా నమోదైంది.

అదానీ పవర్: జూన్ క్వార్టర్‌లో అదానీ పవర్ 83% వృద్ధితో రూ. 8,759 కోట్లకు ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 20% తగ్గి రూ. 11,005 కోట్లకు పరిమితమైంది.

వేదాంత: ఈ కంపెనీ ఇన్వెస్టర్‌ అయిన ట్విన్ స్టార్, గురువారం నాడు, బల్క్ డీల్స్ ద్వారా 15.4 కోట్ల షేర్లను లేదా 4.14% వాటాను ఆఫ్‌లోడ్ చేసింది.

ఐషర్ మోటార్స్: రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ కంపెనీ ఐషర్ మోటార్స్ జూన్ త్రైమాసికం లాభంలో 50% వృద్ధితో రూ. 918 కోట్లను సాధించి, స్ట్రీట్ అంచనాలను అధిగమించింది.

LIC హౌసింగ్ ఫైనాన్స్: మొదటి త్రైమాసికంలో రూ. 1,324 కోట్ల నికర లాభాన్ని LIC హౌసింగ్ ఫైనాన్స్ నమోదు చేయగా, NII రూ. 2,252 కోట్లుగా ఉంది.

వీనస్ పైప్స్: Q1లో ఈ కంపెనీ రూ.17.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ.180 కోట్ల ఆదాయం వచ్చింది.

KEC ఇంటర్నేషనల్: ఏప్రిల్-జూన్ కాలానికి కేఈసీ ఇంటర్నేషనల్ నికర లాభం రూ.42.3 కోట్లుగా లెక్క తేలింది. ఇదే కాలంలో ఆదాయం రూ.4,244 కోట్లుగా ఉంది.

టొరెంట్ పవర్: టోరెంట్ పవర్, తన అనుబంధ సంస్థ ద్వారా, గుజరాత్‌లోని డీశాలినేషన్ ప్లాంట్లకు అవసమయ్యే 132 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం షాపూర్జీ పల్లోంజీ అనుబంధ సంస్థలతో విద్యుత్ బదిలీ ఒప్పందం కుదుర్చుకుంది.

రాడికో ఖైతాన్: జూన్ త్రైమాసికంలో రాడికో ఖైతాన్ రూ. 68 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. రూ.954 కోట్ల ఆదాయం ఆర్జించింది.

కమిన్స్ ఇండియా: తొలి త్రైమాసికంలో కమిన్స్ ఇండియా రూ.316 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ఆదాయం రూ.2,208 కోట్లుగా నమోదైంది.

ఇది కూడా చదవండి: 13 ఏళ్ల గరిష్టాన్ని చేరిన సర్వీస్‌ సెక్టార్‌ గ్రోత్‌, జులైలో 62.3గా నమోదు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *