ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Adani Ent, Paytm, Union Bank

[ad_1]

Stock Market Today, 22 August 2023: NSE నిఫ్టీ నిన్న (సోమవారం) 19,393 వద్ద క్లోజ్‌ అయింది. గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) ఇవాళ (మంగళవారం) ఉదయం 8.25 గంటల సమయానికి 01 పాయింట్లు లేదా 0.01 శాతం రెడ్‌ కలర్‌లో 19,388 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

పేటీఎం: ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం (Paytm), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను తన వ్యాపారంలో ఉపయోగించుకునేందుకు ప్లాన్‌ చేస్తోంది. ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్’ సాఫ్ట్‌వేర్ స్టాక్‌ను రూపొందించడానికి AIలో పెట్టుబడి పెడుతున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్: ప్రమోటర్ గ్రూప్ ఆగస్టులో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ‍‌(Adani Enterprises) తనకు ఉన్న వాటాను మరోసారి పెంచుకుంది. ఈ నెలలో 2.2% స్టేక్‌ కొనుగోలు చేసింది.

వెల్‌స్పన్‌ ఎంటర్ప్రైజెస్: టెక్నాలజీ ఓరియెంటెడ్‌ EPC కంపెనీ మిషిగాన్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (MEPL)లో 50.10% వాటాను విజయవంతంగా కొనుగోలు చేసినట్లు వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్ ‍‌(Welspun Enterprises) ప్రకటించింది. 
డీల్‌ వాల్యూ రూ. 137.07 కోట్లు. ఈ లావాదేవీ తర్వాత, మిచిగాన్ ఇంజినీర్స్‌ కంపెనీ వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ సంస్థగా మారింది. 

యూనియన్ బ్యాంక్: క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్లేస్‌మెంట్ ద్వారా ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ. 5000 కోట్ల వరకు నిధుల సమీకరణకు యూనియన్ బ్యాంక్ ‍‌(Union Bank) డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

టాటా పవర్: టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ-టాటా మోటర్స్‌ మధ్య PPA (విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం) కుదిరింది. ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో ఉన్న సోలార్ ప్లాంట్‌లో 9 MWp కోసం ఈ PPAపై రెండు కంపెనీలు సంతకాలు చేశాయి.

జియో ఫైనాన్షియల్: ట్రేడ్-ఫర్-ట్రేడ్ (T2T) సెగ్మెంట్‌లో 10 ట్రేడింగ్‌ రోజులు పూర్తయిన తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFSL) షేర్లు ఆ సెగ్మెంట్‌ నుంచి బయటకు వచ్చి రోలింగ్ సెగ్మెంట్‌లో భాగమవుతాయని, సెప్టెంబర్ 4 నుంచి ఇది అమలులోకి వస్తుందని BSE, NSE వేర్వేరు సర్క్యులర్‌ల ద్వారా వెల్లడించాయి.

అదానీ పవర్: 2029 ఆర్థిక సంవత్సరం నాటికి 21,110 మెగావాట్ల థర్మల్ కెపాసిటీని అదానీ పవర్ (Adani Power) లక్ష్యంగా పెట్టుకుంది. FY24లో నెట్‌ సీనియర్ డెట్‌ రూ. 26,690 కోట్లుగా ఉంది.

భెల్‌: అదానీ పవర్ యూనిట్ అయిన మహాన్ ఎనర్జెన్ నుంచి భెల్‌ (BHEL)కు ఒక ఆర్డర్‌ అందుకుంది. ఈ ఆర్డర్ విలువ దాదాపు రూ. 4,000 కోట్లు.

టెలికాం కంపెనీలు: టెలికాం సర్వీసెస్‌ సెక్టార్‌లో అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూ (AGR) ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో రూ. 64,494 కోట్లకు చేరిందని ట్రాయ్‌ ప్రకటించింది. అంతకుముందు త్రైమాసికంతో (అక్టోబరు-డిసెంబర్‌) పోలిస్తే ఇది 2.5% ఎక్కువ. 2021-22 మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 9.5% వృద్ధి.

ఇది కూడా చదవండి: ఈసీ3 ఎలక్ట్రిక్‌లో కొత్త వేరియంట్ లాంచ్ చేసిన సిట్రోయెన్ – ఎక్కడ లాంచ్ అయింది? ధర ఎంత?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *