ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ IDFC First Bank, Kotak Bank, IDBI

[ad_1]

Stock Market Today, 04 September 2023: మార్కెట్‌ అంచనాలను మించిన డొమెస్టిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ PMI, సానుకూల GDP వృద్ధి డేటా కారణంగా (బలమైన ఆర్థిక ప్రగతి చిహ్నాలు) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు గత వారాంతంలో స్ట్రాంగ్‌ ర్యాలీ చేశాయి. 

ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ శుక్రవారం 556 పాయింట్లు అప్‌ టిక్‌ పెట్టింది, గత రెండు నెలల్లో బెస్ట్‌ సింగిల్ డే గెయిన్స్‌ను నమోదు చేసింది. బలమైన డొమెస్టిక్‌ మ్యాక్రో డేటా, గ్లోబల్ సిగ్నల్స్‌ వల్ల పవర్, మెటల్, ఆయిల్ స్టాక్స్‌లో వాల్యూ-బయింగ్స్‌ కనిపించడంతో NSE నిఫ్టీ కూడా 19,400 స్థాయికి ఎగువన, 19,435 వద్ద ముగిసింది. BSE బేరోమీటర్ 555.75 పాయింట్లు లేదా 0.86% లాభంతో 65,387.16 వద్ద ముగిసింది, దీనిలోని 26 స్టాక్స్‌ గ్రీన్‌లో ముగిశాయి.

వాల్ స్ట్రీట్ వాచ్
US స్టాక్ ఇండెక్స్‌లు మిక్స్‌డ్‌గా క్లోజ్‌ అయ్యాయి. US అన్‌-ఎంప్లాయ్‌మెంట్‌ డేటాలో పెరగడంతో ట్రెజరీ ఈల్డ్స్‌ తిరిగి పుంజుకున్నాయి. ఫెడరల్ రిజర్వ్, ఈ నెలలో జరిగే సమావేశంలో వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు బలపడ్డాయి.

యూరోపియన్ షేర్స్‌
కమోడిటీ సంబంధిత రంగాల్లో లాభాలు వచ్చినా.. లగ్జరీ కంపెనీలు, ఆటోమేకర్‌ కంపెనీల స్టాక్స్‌ నష్టాలపాలు కావడంతో  యూరోపియన్ షేర్లు శుక్రవారం ఫ్లాట్‌గా ఉన్నాయి.

గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) ఇవాళ (సోమవారం) ఉదయం 8.15 గంటల సమయానికి 25 పాయింట్లు లేదా 0.13 శాతం గ్రీన్‌ కలర్‌లో  19,572 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

IDFC ఫస్ట్ బ్యాంక్: అదానీ గ్రూప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతున్న ప్రముఖ ఇన్వెస్టర్, అమెరికాకు చెందిన GQG పార్టనర్స్.. శుక్రవారం బల్క్ డీల్స్ ద్వారా IDFC ఫస్ట్ బ్యాంక్‌లోనూ వాటాను కొనుగోలు చేసింది.

GMR పవర్: GMR పవర్ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ అయిన GMR స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్‌ అర్బన్ ఇన్‌ఫ్రా.. పూర్వాంచల్‌లో స్మార్ట్ మీటరింగ్ ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి పూర్వాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ నుంచి లెటర్ ఆఫ్ అవార్డ్ (LOA) అందుకుంది.

కోటక్ మహీంద్ర బ్యాంక్: కోటక్ మహీంద్ర బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. ప్రస్తుతం జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న దీపక్ గుప్తా డిసెంబర్ 31 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు నిర్వహిస్తారు.

బయోకాన్: తన పూర్తి యాజమాన్యంలోని స్టెప్-డౌన్ సబ్సిడరీ కంపెనీ బయోకాన్ జెనెరిక్స్ ఇంక్, యుఎస్‌లోని న్యూజెర్సీలోని క్రాన్‌బరీలో ఐవా ఫార్మా ఇంక్‌కు చెందిన ఓరల్ సాలిడ్ డోసేజ్ తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసినట్లు బయోకాన్ ప్రకటించింది.

ఇన్ఫోసిస్: భారత్‌లోని డాన్స్‌కే బ్యాంక్‌కు చెందిన ఐటీ సెంటర్‌ను కొనుగోలు చేసినట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కార్యక్రమాలను వేగంగా పెంచుకోవడానికి ఇన్ఫోసిస్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా డాన్స్‌కే బ్యాంక్ ఎంచుకుంది.

హిందాల్కో: SRPPLలో 26% వాటా కొనుగోలు కోసం.. సెవెన్ రెన్యూవబుల్ పవర్‌తో హిందాల్కో రెండు అగ్రిమెంట్స్‌ కుదుర్చుకుంది. అవి.. స్టేక్‌హోల్డర్స్‌ అగ్రిమెంట్‌, పవర్‌ పర్చేజింగ్‌ అగ్రిమెంట్‌. 

IDBI బ్యాంక్: నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, IDBI బ్యాంక్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం అసెట్ వాల్యూయర్‌ను నియమించడానికి కేంద్ర ప్రభుత్వం బిడ్స్‌ ఆహ్వానించింది.

మహారాష్ట్ర సీమ్‌లెస్: సీమ్‌లెస్ పైపులను సరఫరా చేయడానికి ఆయిల్ ఇండియా, IOCL రూ.157 కోట్ల విలువైన ఆర్డర్‌ను మహారాష్ట్ర సీమ్‌లెస్‌ గెలుచుకుంది.

ఇది కూడా చదవండి: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ Vs అటల్‌ పెన్షన్‌ యోజన – తేడాలు, అర్హతలు, బెనిఫిట్స్‌పై ఫుల్‌ డిటైల్స్‌

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *