ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ RIL, ICICI Bank, Tata Steel

[ad_1]

Stock Market Today, 12 September 2023: G20 సమ్మిట్‌ విజయవంతం కావడంతో, బెంచ్‌మార్క్ నిఫ్టీ సోమవారం రికార్డు స్థాయిలో 20,000 మార్క్‌ను అందుకుంది, ఇది పెట్టుబడిదార్ల సెంటిమెంట్‌ను పెంచింది.

లాభపడ్డ అమెరికా స్టాక్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద టెస్లా ఆలోచనలు పెరగడంతో నాస్‌డాక్ సోమవారం బాగా పెరిగింది. ఈ వారంలో US ఇన్‌ఫ్లేషన్‌ డేటా కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు.

పెరిగిన ఆసియా షేర్లు
వాల్ స్ట్రీట్ నుంచి పాటిజివ్‌ సిగ్నల్స్‌ అందుకున్న ఆసియా స్టాక్స్‌ పెరిగాయి.

FII/DII యాక్షన్‌
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సోమవారం నెట్‌ బయ్యర్స్‌గా మారారు, రూ.1,473 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. డీఐఐలు కూడా రూ.366 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి.

గిఫ్ట్‌ నిఫ్టీ
ఇవాళ ఉదయం 7.45 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 07 పాయింట్లు లేదా 0.03 శాతం రెడ్‌ కలర్‌లో 20,125 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

L&T: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేజర్ లార్సెన్ అండ్ టూబ్రో (L&T), ఒక్కో షేరుకు తన బైబ్యాక్ ఫైనల్‌ ప్రైస్‌ను రూ. 3,000 నుంచి రూ. 3,200 కి పెంచింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: గ్లోబల్ PE కంపెనీ KKR, రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగంలో రూ. 2,069.5 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా కంపెనీలో తన వాటాను 1.42% కు పెంచుకుంటుంది.

ICICI బ్యాంక్: ఈ ప్రైవేట్ రుణదాత మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓగా సందీప్ బక్షిని మరో మూడు సంవత్సరాల పాటు తిరిగి కొనసాగించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదం తెలిపిందని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.

పవర్ గ్రిడ్: రాజస్థాన్‌లోని REZ (20 GW) నుంచి విద్యుత్ ట్రాన్స్‌మిషన్‌ కోసం ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి సక్సెస్‌ఫుల్‌ బిడ్డర్‌గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ నిలిచింది.

లుపిన్: దభాసా, విశాఖపట్నంలో రెండు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్‌ (API) ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, తన అనుబంధ సంస్థ లుపిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్‌తో బిజినెస్‌ ట్రాన్స్‌ఫర్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకోవాలని లుపిన్‌ యోచిస్తోంది. పుణెలోని లుపిన్ రీసెర్చ్ పార్క్‌లో ఫెర్మెంటేషన్‌ సహా R&D కార్యకలాపాలు నిర్వహించడం కూడా ఈ అగ్రిమెంట్‌ కిందకు వస్తాయి.

టొరెంట్ పవర్: కంపెనీలోని ప్రమోటర్ షేర్లను తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే ఆలోచన ప్రమోటర్ గ్రూప్‌నకు లేదని టోరెంట్ పవర్ స్పష్టం చేసింది.

టాటా స్టీల్: కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా టీవీ నరేంద్రన్‌ను కొనసాగించే ప్రతిపాదనకు టాటా స్టీల్ షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు.

TVS మోటార్: అక్టోబర్ 23 నుంచి అమలులోకి వచ్చే మరో ఐదేళ్ల కాలానికి కంపెనీ డైరెక్టర్ & సీఈవోగా కెఎన్ రాధాకృష్ణన్‌ను కొనసాగించడానికి TVS మోటార్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.

స్పైస్‌జెట్: మంగళవారం నాటికి కళానిధి మారన్‌కు 100 కోట్ల రూపాయల చెల్లింపును పూర్తి చేస్తామని స్పైస్‌జెట్ తెలిపింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: మీ పెట్రోల్‌ డబ్బుల్ని ‘కారే’ చెల్లిస్తుంది! ఫాస్టాగ్‌ రీఛార్జి కూడా!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *