ఈ ఏడాది అద్భుతమైన ధనయోగం.. ఈ రాశివారికి

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

తెలుగు నూతన సంవత్సరాన్ని ఉగాది పర్వదినంగా జరుపుకుంటాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులవారి జీవితం ఈ పండగ నుంచి కొత్తగా ప్రారంభమవుతుంది. రాశుల ఫలితాలు ఎలా ఉంటాయి? లాభమా? నష్టమా? అని తెలుసుకునేందుకు పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. సింహ రాశి, కన్యారాశి, తులా రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉందో చూద్దాం.

సింహరాశి రాశివారికి ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంది: వీరికి అదృష్ట యోగం 50 శాతం ఉంది. అద్భుతమైన ధనయోగాన్ని సూచిస్తోంది. ఏప్రిల్ 22వ తేదీ తర్వాత గురుబలం వల్ల విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవడమే కాకుండా ఉద్యోగస్తులు తమ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. శని సప్తమ రాశిలో ఉండటంతో భాగస్వామితో వివాదం ఏర్పడే అవకాశం కనపడుతోంది. ఏప్రిల్ 22వ తేదీ వరకు సింహరాశివారు కష్టపడాల్సి ఉంటుంది.

ఎందుకంటే.. గురువు సంచరిస్తున్నారు కాబట్టి. ఉన్న ఆస్తిని వృద్ధి చేయడమే కాకుండా ఇంట్లో శుభకార్యాలు కూడా చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. రాహువు అష్టమి, నవమిల్లో ఉండటంవల్ల ఈ సంవత్సరం మొత్తం యోగించే పరిస్థితి కనపడటంలేదు. అక్టోబరు 31వ తేదీ వరకు కేతువు మూడో రాశిలో సంచరిస్తున్నాడు. ఈ ప్రభావంవల్ల అన్నీ శుభఫలితాలే ఉంటాయి. ఆ తర్వాత రెండోరాశిలో విఘ్నాలుంటాయి కాబట్టి కేతువు శ్లోకం పఠించాలి.

leo and virgo zodiac signs are this year results

కన్యారాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంది: కన్యారాశివారు ఈ సంవత్సరం మొత్తం ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం. ఇతరులతో దురుసుగా మాట్లాడటం మానుకొని సౌమ్యంగా సంభాషించడం నేర్చుకోవాలి. గురుబలం వల్ల ఎదురు చూస్తున్న పనుల్లో మంచి జరుగుతుంది. దీనికి కారకుడు గురుబలం. ఏప్రిల్ 22వ తేదీలోపే మంచి జరుగుతుంది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి అష్టమ సంచారం వల్ల ఆటంకాలేర్పడతాయి. గురువు సప్తమంలో ఉన్నంతకాలం శుభయోగాలున్నాయి. గురువుకు సంబంధించిన శ్లోకం పఠించాలి.

ఉద్యోగంలో పూర్వార్థం బాగుంటుందికానీ ఆ తర్వాత గురుబలం లోపించడంతో ఏకాగ్రతగా పనిచేయాల్సి ఉంటుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. వ్యాపారం బాగుంటుంది. దీంతోపాటు ఎప్పటి పనిని అప్పడే పూర్తిచేయాల్సి ఉంటుంది. పని వాయిదా వేయడంవల్ల నష్టం జరిగే అవకాశం కనపడుతోంది.

శని సంవత్సరం మొత్తం షష్ఠ స్థానంలో ఉండటంవల్ల మంచి అదృష్టం కలుగుతుంది.అక్టోబరు 31వ తేదీ వరకు రాహువు అష్టమస్థానంలో ఉండి ఆటంకాలు కల్పిస్తాడు. రాహువుకు సంబంధించిన శ్లోకం పఠించాలి. ద్వితీయంలో కేతువు వైరాగ్యంతోపాటు నిరాశను కలిగిస్తాడు. ఇబ్బందికరమైన ఫలితాలతో ఉత్సాహాన్ని కూడా తగ్గించే అవకాశం కనపడుతోంది.

English summary

After 22nd April Gurubalam not only students will pass in higher class but also employees will get results for their hard work.

Story first published: Saturday, March 25, 2023, 11:56 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *