[ad_1]
High Yielding Hybrid Mutual Funds in 2023: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ (MFs) కూడా ఒక మార్గం. మార్కెట్‌లోని ఒడిదొడుకులు మ్యూచువల్ ఫండ్స్ మీద చూపే ప్రభావం తక్కువగా ఉంటుంది. అదే, నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ (Investing risk) చాలా ఎక్కువగా ఉంటుంది. దీనర్ధం.. మ్యూచువల్ ఫండ్స్ వల్ల స్టాక్ మార్కెట్ రిస్క్/పెట్టుబడి డబ్బుకు ప్రమాదం తక్కువగా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్ రకాలు (Types of Mutual Funds)
మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ఫండ్ స్కీమ్‌లు కేవలం ఈక్విటీల మీదే దృష్టి పెడతాయి. వీటిని ఈక్విటీ ఫండ్స్ (Equity funds) అంటారు. దీనికి భిన్నంగా, మరికొన్ని ఫండ్స్ ఈక్విటీలు + డెట్ మీద ఫోకస్ చేస్తాయి. ఇంకొన్ని ఫండ్స్ ఈక్విటీలు + డెట్ + గోల్డ్, ఇతర అసెట్ క్లాస్‌ల్లోనూ పెట్టుబడి పెడతాయి. వీటిని హైబ్రిడ్ ఫండ్స్ (Hybrid Funds) అంటారు. హైబ్రిడ్ ఫండ్స్‌లో మీరు డబ్బు పెడితే, మీ పెట్టుబడిలో వైవిధ్యం (Diversification) ఉంటుంది. దీనివల్ల రిస్క్ చాలా తగ్గుతుంది. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని మ్యూచువల్ ఫండ్ రకాలు కూడా ఉన్నాయి.
హైబ్రిడ్ ఫండ్స్‌లో మీరు పెట్టే డబ్బును విభిన్న ఆస్తి తరగతుల్లో ఆ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే, ఒకే పెట్టుబడితో డైవర్సిఫికేషన్ బెనిఫిట్స్ మీకు అందుతాయి. మార్కెట్ తుపానులో కొట్టుకుపోకుండా, మీ రాబడిలో స్థిరత్వాన్ని ఈ ఫండ్ తీసుకొస్తుంది.
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD), చాలా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్’ అత్యుత్తమంగా దాదాపు 33% రిటర్న్స్ డెలివెరీ చేసింది. అదే సమయంలో 10కి పైగా హైబ్రిడ్ ఫండ్స్ 20 శాతం పైగా లాభాలను కళ్లజూశాయి.
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో రకాలు (Types of Hybrid Mutual Funds):
ప్రస్తుతం, మార్కెట్‌లో చాలా రకాల హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. నిధుల కేటాయింపు నిష్పత్తి ఆధారంగా వాటిని ప్రధానంగా రెండు రకాలుగా చూడవచ్చు.
1. అగ్రెసివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ (Aggressive Hybrid Mutual Funds)
2. కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ (Conservative Hybrid Mutual Funds)
2023లో టాప్-10 అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్, వాటి (YTD) రిటర్న్స్:
1. బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ — 32.64%
2. JM అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ — 31.89%
3. ICICI ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ — 25.02%
4. ఎడెల్వీస్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ — 24.00%
5. DSP ఈక్విటీ అండ్ బాండ్ ఫండ్ — 23.30%
6. UTI అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ — 22.27%
7. HSBC అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ — 21.87%
8. ఇన్వెస్కో ఇండియా ఈక్విటీ అండ్ బాండ్ ఫండ్ — 21.71%
9. నిప్పాన్ ఇండియా ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ — 21.48%
10. మహీంద్రా మ్యానులైఫ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ — 21.29%
2023లో టాప్-10 కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, వాటి (YTD) రిటర్న్స్:
1. మోతీలాల్ ఓస్వాల్ అసెట్ అలొకేషన్ పాసివ్ ఫండ్ — 13.47%
2. కోటక్ డెట్ హైబ్రిడ్ ఫండ్ — 13.42%
3. HDFC హైబ్రిడ్ డెట్ ఫండ్ — 12.92%
4. పరాగ్ పారిఖ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ — 12.67%
5. DSP రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ — 11.52%
6. బరోడా BNP పరిబాస్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ — 11.27%
7. SBI కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ — 11.16%
8. HSBC కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ — 10.95%
9. ICICI ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ — 10.94%
10. ఫ్రాంక్లిన్ ఇండియా డెట్ హైబ్రిడ్ ఫండ్ — 10.53%
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మీ ఆదాయం రూ.7.27 లక్షలు దాటకుంటే ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు
[ad_2]
Source link
Leave a Reply