[ad_1]
కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి ఇప్పటికే చాలా మందులు ఉన్నాయి, అయితే JACC జర్నల్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం, కొత్త కొలెస్ట్రాల్ డ్రగ్ MK-0616 (MK-0616) చెడు కొలెస్ట్రాల్‌ను 60% వరకు తగ్గించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ కొత్త ఔషధం కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గిస్తుంది, ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
MK-0616 కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గిస్తుంది..?
పరిశోధకులు ఇటీవల MK-0616 ఔషధంపై రెండవ ట్రయల్‌ను పూర్తి చేశారు. MK-0616 ఔషధం PCSK9 అనే ప్రోటీన్ నిరోధిస్తుంది. తక్కువ సాంద్రత ఉన్న లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్‌ను లివర్ విచ్ఛిన్నం చేయడానికి PCSK9 ప్రోటీన్ సహాయపడుతుంది.
8 వారాలా పాటు ఇచ్చారు..
పరిశోధకులు తమ అధ్యయనంలో 380 మంది హృద్రోగులను గ్రూపులుగా విభజించి 8 వారాల పాటు ఈ మెడిసిన్‌ను వారికి ఇచ్చారు. ఈ టాబ్లెట్ 6mg, 12mg, 18mg, 30mgలలో అందుబాటులో ఉంది.
41 శాతం తగ్గింది
ఈ ట్యాబ్లెట్ 30mg మోతాదు తీసుకున్న వారిలో 60%, 18mg తీసుకున్న వారిలో 59%, 12mg తీసుకున్న వారిలో 55%, 6mg తీసుకున్న వారిలో 41% చెడు కొలెస్ట్రాల్ తగ్గిందని పరిశోధకులు కనుగొన్నారు.
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?
ఈ ఔషధం కారణంగా ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ ఔషధాన్ని.. మరింత వివరంగా పరిశోధించడానికి మరిన్ని ట్రయల్స్ అవసరమని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ.. హార్ట్ పేషెంట్స్‌కు ఇది గొప్పవరం అనే చెప్పాలి.
స్టాటిన్స్‌తో మంచి కాంబినేషన్..
ఈ ట్యాబ్లెట్.. స్టాటిన్స్‌తో బాగా పనిచేస్తుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ట్రయల్స్‌లో 60% మంది ఇప్పటికే.. స్టాటిన్స్ తీసుకుంటున్నారని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ ట్యాబ్లెట్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply