[ad_1]
యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టడానికి ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని స్థాయిలు తగ్గించడానికి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అయితే, మీరు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి.. ఆయుర్వేద నివారణలు కూడా ప్రయత్నించవచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి తిప్ప తీగ సహాయపడుతుందని ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ కపిల్ త్యాగి (Dr. Kapil Tyagi, director of ‘Kapil Tyagi Ayurveda Clinic) అన్నారు.
తిప్పతీగ..
ఆయుర్వేదంలో వాడే అద్భుతమైన ఔషధ మొక్క తిప్పతీగ. సంస్కృతంలో దీన్ని అమృతవల్లి అంటారు. అంటే మరణం లేకుండా చేసేదని అర్థం. దీని ఆకులు, కాండం, పువ్వు, వేరు, విత్తనం… ఇలా మొక్క మొత్తం ఔషధగుణాలు నిండి ఉంటాయి. ఇందులో మినరల్స్, లవణాలు ఎక్కువగా ఉంటాయి. దీని ఔషధ గుణాలు చాలావరకు కాండం, ఆకుల్లో ఉంటాయి. ఈ సమర్థమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. తిప్పతీగ యూరిక్ యాసిడ్, గౌట్ సమస్యకు చెక్ పెట్టడానికి అద్భుతమైన మూలిక, ఇది శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిలను న్యూట్రల్ చేతుంది.
(image source – pixabay)
అధ్యయనం పేర్కొంది..
తిప్పతీగ కాండం నుంచి సేకరించిన రసం.. గౌట్ సమస్యకు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుందని 2017లో జరిపిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఎందుకంటే ఇది శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిలను న్యూట్రల్ చేస్తుంది.
(image source – pixabay)
ఈ లాభాలు ఉంటాయి..
తిప్పతీగలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ స్పాస్మోడిక్, యాంటీ అలెర్జిక్, యాంటీ హెచ్‌ఐవి, యాంటీకాన్సర్ గుణాలు మెండుగా ఉంటాయి. కామెర్లు, మూత్ర సమస్యలు, చర్మ వ్యాధులు, మధుమేహం, రక్తహీనత, ఇన్‌ఫ్లమేషన్, అలర్జీలు.. ఇలా అనేక సమస్యల నివారణలో ఈ తీగని వాడతారు. తిప్పతీగ ఆకులతో చేసిన అరటీస్పూను పొడిని ఉదయం, రాత్రి భోజనం తరవాత నీళ్లలో కలిపి తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. దీని ఆకులలో ప్రొటీన్, కాల్షియం, ఫాస్పరస్, ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్స్ , గ్లైకోసైడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డెంగీ, అలర్జీతో వచ్చే జ్వరాలన్నింటికీ తిప్పతీగ మంచి మెడిసిన్‌లా పని చేస్తుంది. కాడలతో సహా దీని ఆకుల్ని మెత్తగా నూరి, నీళ్లలో కలిపి జ్యూస్ / టీ రూపంలో ఖాళీ కడుపుతో తాగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి.
(image source – pixabay)
ఈ జాగ్రత్తలతో.. యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!
ఎలా తీసుకోవాలి..?
తిప్పతీగ తాజా ఆకులు, కాండం తీసుకోని వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే గ్రైండ్ చేసి 1 గ్లాసు నీళ్లలో వేసి సగం అయ్యేవరకు మరిగించాలి. ఆ తర్వాత దీన్ని ఫిల్టర్ చేసి తాగొచ్చు.
తాజా తిప్ప తీగను ఆకులతో పాటు దంచి, రసం తీసి తాగొచ్చు. ఎండించి పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. చెంచాడు చూర్ణాన్ని వేడినీటిలో కలిపి గానీ కషాయంగా కాచుకొని గానీ తాగొచ్చు. కాండం, ఆకుల రసమైతే పావు కప్పు నుంచి అర కప్పు వరకు తీసుకోవచ్చు.
Also Read:ఈ రసం తాగితే.. శరీరంలో యూరిక్ యాసిడ్ కరుగుతుంది..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply