ఈ-కామర్స్ రంగంలో పెను సంచలనం సృష్టించే దిశగా టాటాలు.. మ్యాటర్ లీకైంది..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Tata Neu: సాల్డ్ నుంచి సాఫ్ట్ వేర్ వరకు టాటాలు చేయని వ్యాపారం లేదు. అయితే దేశంలో తన వ్యాపారాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని గ్రూప్ నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా అనేక సేవలను ఒకే వేదికమీదకు తీసుకొచ్చింది.

దేశంలోని ఈ-కామర్స్ రంగంలో పెను సంచలనాలు సృష్టించే దిశగా టాటాలు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అదానీ గ్రూప్, రిలయన్స్ గ్రూప్, వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలకు పెద్ద పోటీని ఇవ్వనుంది. ఇందుకోసం తన ప్రఖ్యాత టాటా న్యూ యాప్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ లాంచ్ చేసింది. ఈ క్రమంలో రిలయన్స్, అదానీ గ్రూప్స్ సైతం తమ సూపర్ యాప్ లను లాంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి.

ఈ-కామర్స్ రంగంలో పెను సంచలనం సృష్టించే దిశగా టాటాలు..

ప్రస్తుతం టాటాలు తమ సూపర్ యాప్ టాటా నియోలోకి 2 బిలియన్ డాలర్ల మూలధనాన్ని అందించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైందని బ్లూమ్ బెర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే టాటా గ్రూప్ ఆదాయాల విషయంలో అతిపెద్ద గ్రోత్ చూడపోతోందని తెలుస్తోంది. ఈ మెుత్తాన్ని కంపెనీ సేవల విస్తరణ, సాంకేతిక పురోగతితో పాటు ఇతర అవసరాలకు వినియోగించనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం టాటాలు పెట్టుబడిగా పెట్టే రెండు బిలియన్ డాలర్లను రానున్న రెండేళ్లలో తిరిగి పొందగలదని తెలుస్తోంది. ఇలా చేయటం ద్వారా చైనాకు చెందిన అలీపే, వీచాట్ వంటి సంస్థల మాదిరిగా టాటా న్యూ ను అభివృద్ధి చేయాలని టాటాలు చూస్తున్నారు. మెుదటి ఆర్థిక సంవత్సరంలో 8 బిలియన్ డాలర్ల విక్రయాలను దీని ద్వారా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కంపెనీ కేవలం అందులో సగం అయిన 4 బిలియన్ డాలర్లను మాత్రమే చేరుకోగలదని తెలుస్తోంది.

ఈ-కామర్స్ రంగంలో పెను సంచలనం సృష్టించే దిశగా టాటాలు..

సూపర్ యాప్ లాంచ్ నుంచి అనేక టెక్నికల్ గ్లిచ్‌లను కలిగి ఉంది. దీనిపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు సైతం భారీగానే అందాయి. ఈ క్రమంలో టాటా న్యూ లో కొత్తగా పెట్టుబడులు పెట్టాలని కంపెనీ సరైన సమయంలో నిర్ణయించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ పెట్టుబడులు యాప్ సాంకేతిక లోపాలను సరిచేందుకు, టెక్నికల్ గా మరింత మెరుగైన సేవల అనుభూతిని కస్టమర్లకు అందించేందుకు సహాయపడుతుందని తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

English summary

Tata group infusing 2 billion capital into super app tata neu to boost e commerce business

Tata group infusing 2 billion capital into super app tata neu to boost e commerce business..

Story first published: Thursday, March 23, 2023, 16:34 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *