ఈ కూరగాయలతో.. ఎయిర్‌ పొల్యూషన్‌కు చెక్‌ పెట్టేయండి..!

[ad_1]

Anti-Pollution Foods:బయటకు వెళ్తే.. మాస్క్‌, స్కార్ఫ్‌ కచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే.. ఈ పొల్యూషన్‌ను అసలు తట్టుకోలేం. పెద్ద.. పెద్ద సిటీస్‌లో పొల్యూషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా వాయు కాలుష్యం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎయిర్‌ పొల్యూషన్‌ కారణంగా అనేక అనారోగ్యాలు మనల్ని ఎటాక్‌ చేస్తున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం లక్షల మంది ప్రాణాలను సైతం బలితీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క 2019లోనే మన దేశంలో 9,07,000 మంది దీని కారణంగానే మృతి చెందినట్లు గ్లోబల్‌ లాన్సెట్‌ కౌంట్‌డౌన్‌ రిపోర్ట్‌-2021 పేర్కొంది. కాలుష్యం కారణంగా.. గాలిలో అనేక ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. CDC ప్రకారం, EPA కొన్ని ప్రమాదకర పదార్థాలను వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ కాలుష్యాలు వాతావరణంలో కలసి, గాలిని కలుషితం చేస్తాయి. గాలిలో కార్బన్ మోనాక్సైడ్, లెడ్‌, నైట్రోజన్ ఆక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్, బెంజీన్ వంటి ప్రమాదక పదార్థాలు చేరి కలుషితం చేస్తున్నాయి. ఇవి ఊపరితిత్తులు, గుండె, శరీరంలో ఇతర అవవాలను దెబ్బతీస్తాయి. మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరం నుంచి ఈ కాలుష్యాలను తొలగించవచ్చని పోషకాహార నిపుణురాలు పూజా మఖిజా అన్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

వాయు కాలుష్యం

క్రూసిఫరస్‌ కూరగాయలు..

బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, కాలే క్రూసిఫరస్‌ కూరగాయల కుటుంబానికి చెందుతాయి. ఈ క్రూసిఫరస్ కూరగాయలలో సల్ఫోరాఫేన్ ఉంటుందని పూజా మఖిజా అన్నారు. ఇది బెంజీన్ అనే ప్రమాదకరమైన పదార్థాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. క్రూసిఫరస్‌ కూరగాయలలో విటమిన్‌ సి, బీటా కెరోటిన్‌ వంటి పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

అవిసె గింజలు..

వాయుకాలుష్యం వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు అవిసె గింజలు సహాయపడతాయని పూజా మఖిజా అన్నారు. అవిసె గింజలలో ఫైటోఈస్ట్రోజెన్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పోగమంచు కారణంగా ఆస్తమా పేషెంట్స్‌ ఎంతో ఇబ్బంది పడతారు. ఆస్తమా పేషెంట్స్‌ వారి డైట్‌లో అవిసె గింజలు చేర్చుకుంటే.. ఉపశమనం లభిస్తుందని పూజా మఖిజా సూచించారు. ప్రతిరోజూ 2 టీస్పూన్ల అవిసె గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం తీసుకోవాలని అన్నారు.

ఉసిరి..

ఉసిరికాయ గొప్ప యాంటీ పొల్యూషన్ ఫుడ్. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది గాలిలో ఉండే ప్రాణాంతక పదార్థాల వల్ల కలిగే సెల్యులార్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. మీరు పొల్యూషన్‌ ఎక్కువగా ఉండే ఏరియాలో నివసిస్తుంటే.. ప్రతి రోజూ వెజిటెబుల్‌ జ్యూస్‌లో ఓ ఉసిరి కాయ వేసుకుని తాగండి. రోజుకు ఒక ఉసిరికాయ తిన్నా మంచిదే.

పసుపు..

పసుపులో కర్కుమిన్ ఉంటుంది, ఇది వాయుకాల్యుషం కారణంగా వచ్చే ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పొల్యూషన్‌ ఎఫెక్ట్‌ను తొలగించడానికి.. కేవలం పాలు, నీళ్లో పసుపు వేసుకుని తాగితే సరిపోదాని పూజా అన్నారు. కాలుష్యం వల్ల వచ్చే ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి ప్రతి రోజూ 500 mg కర్కుమిన్ సప్లిమెంట్ తీసుకోవాలని సిఫార్సు చేశారు. అలాగే మన డైట్‌లో పసుపు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

క్యారెట్‌..

సిగరెట్లు, వాహనాల నుంచి వచ్చే పొగలో ఆక్రోలీన్‌ అనే అలెర్జీ పదార్థం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు, చర్మంపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. క్యారట్‌, సెలెరీ బెస్ట్ యాంటీ పోల్యూషన్‌ ఫుడ్స్‌ అని నిపుణులు అంటున్నారు. వీటిలో ఫైటోన్యూట్రియెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తరచుగా మన డైట్‌లో తీసుకుంటే.. శరీరంలో ఆక్రోలీన్‌ అధికంగా పోగుపడకుండా ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *