[ad_1]
క్యారెట్, యాపిల్ జ్యూస్..
- 200 గ్రాముల క్యారెట్లు
- 200 గ్రాముల యాపిల్
- 1 అంగుళం అల్లం ముక్క
- రుచికి తగ్గట్టు రాక్ సాల్ట్
క్యారెట్, యాపిల్ ముక్కలుగా కోసుకుని బ్లెండర్‌లో వేసి బ్లెండ్ చేయండి. బ్లెండర్‌లో తగినన్ని నీళ్లు వేయండి. మీ టేస్ట్‌కు తగ్గట్టు.. కొంచెం రాక్ సాల్ట్ వేయండి. ఇది స్మూత్‌గా అయ్యే వరకు బ్లెండ్ చేయండి. మీకు కావాలంటే ఫిల్టర్ చేయండి. టేస్టీ, హెల్తీ.. జ్యూస్ రెడీ.
బీట్‌రూట్, ఉసిరి జ్యూస్..
- బీట్‌రూట్ ముక్కలు – 1 కప్పు
- ఉసిరి ముక్కలు – 1 కప్పు
- అల్లం – 1/2 అంగుళం
- పుదీనా ఆకులు – 5-6
- వేయించిన జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్
- నల్ల ఉప్పు – 1/2 స్పూన్
- నిమ్మరసం – 1/2 స్పూన్
- తేనె – 1/2 స్పూన్
- నీళ్లు – 1 కప్పు
తరిగిన బీట్‌రూట్, ఉసిరి, అల్లం, పుదీనా ఆకులను బ్లెండర్‌లో వేయండి. ఇది మెత్తగా అయ్యే వరకు మిక్స్ చేయండి. దానిలో నీళ్లు పోయండి. ఆ తర్వాత జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, నిమ్మరసం, తేనె వేసి మళ్లీ బ్లెండ్ చేయాలి. గ్లాస్‌లో వేసుకుని సర్వ్ చేసుకోండి.
పాలకూర, కీరా జ్యూస్..
- కీరా – 200 గ్రాములు
- పాలకూర – 50 గ్రాములు
- అల్లం ముక్క – 1/4 అంగుళం
- నిమ్మరసం – 1/2 స్పూన్
- రాక్ సాల్ట్
దోసకాయ ముక్కలు, పాలకూర, అల్లం బ్లెండర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. అవసరమైతే నీరు జోడించండి. అది జ్యూస్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత.. మీ రుచికి తగ్గట్టు ఉప్పు, నిమ్మరసం యాడ్ చేయండి.
సొరకాయ, ఆరెంజ్, పైనాపిల్..
- పైనాపిల్ ముక్కలు – 1 కప్పు
- ఆరెంజ్ తొనలు – 1 కప్పు
- సొరకాయ ముక్కలు – 1 కప్పు
- కీరా – 1 కప్పు
- తులసి ఆకులు
- కరివేపాకు
ఇవి అన్నీ కలిపి బ్లెండర్‌లో వేయండి. దానిలో 1 గ్లాస్ నీళ్లు వేసి మళ్లి బ్లెండ్ చేయండి. ఆ తర్వాత.. దాన్ని ఫిల్టర్ చేసి మీ జ్యూస్ ఎంజాయ్ చేయండి.
టమాటా, కీరా జ్యూస్..
- టమాటాలు – 3
- కీరా – 1/2 కప్పు
- పుదీనా ఆకులు
- ఉప్పు
- నిమ్మరసం
టమాటాలను ఉడకబెట్టి.. నీటిలో వేసి చల్లార్చాలి. టమాటాలను, కీరా ముక్కలను బ్లెండర్‌లో వేసి బ్లెండ్ చేయండి. దీనిలో కొద్దిగా.. చల్లటి నీరు, నిమ్మరసం, ఉప్పు, పుదీనా ఆకులు వేసి మళ్లీ బ్లెండ్ చేయండి. ఆ తర్వాత జ్యూస్‌ను ఎంజాయ్ చేయండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply