ఈ దుంప కూరలు తింటే.. క్యాన్సర్‌, గుండె సమస్యలు రావు..!

[ad_1]

Root Vegetables Health Benefits: దుంప కూరగాయలు.. దాదాపు అన్ని కాలాల్లోనూ లభిస్తాయి. కానీ, శీతాకాలం ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో దుంప కూరగాయల రేట్లు కూడా చీప్‌గానే ఉంటాయి. ఈ కాలంలో దుంప కూరగాయలు మన డైట్‌లో చేర్చుకుంటే.. శరీరానికి అన్ని విధాలుగా మేలు జరుగుతుందని అమెరికన్‌ డాక్టర్‌ జోషాక్స్ అన్నారు. దుంపల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు, ప్యాట్స్‌, కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటాయి. దుంప కూరల్లో కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో పొటాషియం, ఫోలేట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు ఎ, బి, సి, మాంగనీస్, ఐరన్, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. దుంప కూరలు తరచుగా తీసుకుంటే.. ఫైబర్‌ లోపం దూరం అవుతుందని అమెరికన్‌ డాక్టర్‌ జోషాక్స్ అన్నారు. ఇవి డైట్‌లో చేర్చుకంటే.. త్వరగా బరువు తగ్గుతారు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, క్యాన్సర్‌, గుండె సమస్యలు నుంచి రక్షణ లభిస్తుంది. కొలెస్ట్రాల్‌, డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

దుంప కూరలు..

బీట్‌రూట్‌..

బీట్‌రూట్‌లో బీటైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. వీటిలో నైట్రేట్లు ఉంటాయి, ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, బీపీని తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా పొటాషియం, మాంగనీస్, ఐరన్, ఫోలేట్, బి విటమిన్లు వంటి మూలకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. బీట్‌రూట్‌లోని ‘బెలాటిన్‌’ అనే యాంటీఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది. దీంట్లో పొటాషియం, ఫోలేట్‌ నిల్వలూ ఎక్కువే. ఇవి నాడులు సక్రమంగా పనిచేసేలా చూడటమే కాకుండా మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి. దీంట్లో ఐరన్‌ పెద్ద మొత్తంలోనే ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది.

క్యారెట్‌..

క్యారెట్‌లో ఎ,సి,కె,బి విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుండెకు మంచిది. హైబీపీని తగ్గిస్తాయి. టైప్‌-2 డయాబెటిస్‌ను తగ్గిస్తాయి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు నయమౌతాయి. క్యాన్సర్‌ కారకాలను నియంత్రిస్తాయి. క్యారెట్‌లో బీటా కెరోటిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది కెరోటినాయిడ్. బీటా కెరోటిన్ శరీరం లోపల విటమిన్ ఎగా మారుతుంది. కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది.

చిలగడ దుంప..

చిలగడ దుంపల్లో బీటా-కెరొటిన్‌, విటమిన్‌-ఈ, సి, బి-6, పొటాషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. షుగర్‌ పేషెంట్స్‌ చిలగడ దుంప తింటే.. మంచిది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతర్గత అవయవాల వాపుని తగ్గిస్తాయి. ఫైబ్రినోజెన్‌ రక్తం గడ్డకట్టకుండా సాయపడుతుంది. ఇందులో ఉండే కెరొటినాయిడ్స్‌, విటమిన్‌ ఏ వంటివి కంటిచూపుని మెరుగుపరుస్తాయి.

టర్నిప్‌..

టర్నిప్‌లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది, ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. టర్నిప్‌లో విటమిన్ ఎ, బి , సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మాంగనీస్‌, రాగి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ముల్లంగి..

ముల్లంగిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముల్లంగిలో విటమిన్ ఎ, బి6, ఇ, కె, ఫైబర్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి మినరల్స్‌ మెండుగా ఉంటాయి. దీనిలో కాటెచిన్స్, పైరోగల్లోల్, వెనిలిక్ యాసిడ్‌, ఫినోలిక్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముల్లంగిలో గ్లూకోరాఫానిన్ అనే క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. ముల్లంగి రక్తనాళాల ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది, హైపర్‌టెన్షన్‌ తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధపడుతుంటే.. ఇది బెస్ట్‌ ఆప్షన్‌.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *