[ad_1]
ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారంటే..
కిడ్నీలో రాళ్ళ సమస్య వచ్చిందంటే కూర్చోలేక, పడుకోలేక నరకంగా ఉంటుంది. కొందరికి ఈ సమస్య వచ్చి పోతుంది. మరికొంతమందికి ఒక్కసారి బాధ ఉంటుంది. ఈ ఆర్టికల్‌లో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నితికా కోహ్లీ సోషల్ మీడియా వేదికగా కొన్ని చిట్కాల గురించి చెబుతున్నారు.
అల్లం..
అల్లంని మనం ఇంట్లో వాడతాం. ఎక్కువగా కూరల్లో, టీలలో అల్లంని వేస్తారు. దీనిలోని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యల్ని దూరం చేయడమే కాకుండా అజీర్ణం, మలబ్దకం, వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకి అల్లం చెక్ పెడుతుంది. ఈ సమస్యలతో పాటు కిడీల రాళ్ళ సమస్యని కూడా తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నితికా కోహ్లీ చెబుతున్నారు.
ఎలా పనిచేస్తుందంటే..
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో మంటను కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో ఇవి కీ రోల్ పోషిస్తాయి. అంతేకాకుండా, శరీరంలోని మలినాలను కలిగించే టాక్సిన్స్‌ని బయటికి పంపి కిడ్నీ, లివర్‌ని కాపాడుతుంది. కాబట్టి, రోజూ వంటలో అల్లం వాడడం, అల్లం టీ చేసి తాగడం చాలా మంచిది.
Also Read : Cinnamon Tea : దాల్చిన చెక్క టీ తాగితే షుగర్ కంట్రోల్ అవుతుందా..
త్రిఫల..
ఆయుర్వేదంలో త్రిఫలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిని పురాతన కాలం నుంచి మూడు రకాల మూలికలను కలుపుతూ తయారుచేస్తున్నారు.
ఇందులో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండే ఉసిరి, కరక్కాయ, తానికాయలతో కలిపి చేస్తారు.
ఈ త్రిఫల చూర్ణంలో ఎక్కువగా శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఆయుర్వేద నిపుణుల ప్రకారం..
ఆయుర్వేద మూలిక గురించి ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ నీతికా కోహ్లీ ప్రకారం, ఇది మూత్రం ద్వారా శరీరంలో పేరుకుపోయిన విషపూరిత వ్యర్థాలను బయటకు పంపేందుకు మూత్రపిండాలకు సహాయపడుతుంది. దీంతో భవిష్యత్‌లోనూ సమ్యలు రావు.
త్రిఫల చూర్ణాన్ని ఓ గ్లాసు నీటిలో కలిపి ప్రతిరోజూ తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలన్నీ తగ్గి బాడీలోని చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.
పసుపు..
పసుపు కూడా అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉన్న మూలిక. దీనిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం నుంచి కిడ్నీ సమస్యలు కూడా తగ్గిపోతాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా ఇది ఓ హెల్దీ హెర్బ్ అని చెప్పొచ్చు.
కాబట్టి, దీని ప్రయోజనాలను పొందేందుకు ప్రతిరోజూ పసుపు పాలు తాగడం మంచిది.
Also Read : Burning Tongue : నాలుక కాలిందా.. ఇలా చేస్తే వెంటనే రిలీఫ్..
కొత్తిమీర..
కొత్తిమీర కూడా బ్లాడర్, యుటెరెస్‌లోని ఇన్ఫెక్షన్ తగ్గేలా చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా వరకూ సమస్య తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. దీనిని జ్యూస్‌లా చేసుకుని తాగొచ్చు. లేదా వంటల్లో ఎక్కువగా వాడొచ్చు.
గుర్తుంచుకోండి..
అయితే, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నిజానికి చాలా హెల్దీ అయినప్పటికీ మీరు తీసుకునేటప్పుడు ఎప్పుడు ఎలా, ఎంత మోతాదులో తీసుకోవాలనే దాని గురించి ఆయుర్వేద నిపుణులని అడిగి మాత్రమే తీసుకోవాలి. డైరెక్ట్‌గా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Home Remedies News and Telugu News
[ad_2]
Source link
Leave a Reply