ఈ పుల్లటి పండ్లు తింటే..కొలెస్ట్రాల్‌ వెన్నలా కరుగుతుంది..!

[ad_1]

High Cholesterol: ప్రస్తుతం చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు రెండు రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్‌.. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగితే.. గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువవుతుంది. ఇవి రక్తనాళాల గోడలను దెబ్బతీసి పూడికలు ఏర్పడేలా చేస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగితే.. గుండెపోటు, గుండె సమస్యలు, స్ట్రోక్‌, హైపర్‌టెన్షన్‌ వెంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని.. కొలెస్ట్రాల్‌ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. శారీరకంగా యాక్టివ్‌గా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు, అధిక ఫైబర్, నీరు అధికంగా ఉండే ఆహార పదార్థాలు మీ డైట్‌లో చేర్చుకుంటే.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. పైన పేర్కున్న లక్షణాలు సిట్రస్‌ పండ్లలో పుష్కలంగా ఉంటాయి.
రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సిట్రస్‌ పండ్లు తీసుకోవడం ఉత్తమ మార్గమని నిపుణులు అంటున్నారు. సిట్రస్‌ పండ్లలో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పెక్టిన్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్‌ సమస్యను పరిష్కరించడానికి సహాయపడతాయి. అధిక కొలెస్ట్రాల్‌ సమస్యను పరిష్కించడానికి తీసుకోవలసిన పండ్లు ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

పియర్‌..

పియర్‌..

కొలెస్ట్రాల్‌ను తగ్గించే.. బెస్ట్‌ ఫ్రూట్స్‌లో పియర్‌ ఒకటి. ఒక అధ్యయనం ప్రకారం, పియర్‌లో కరిగే ఫైబర్‌, కరగని ఫైబర్‌ అధికంగా ఉంటాయి. పియర్‌లో లిగ్నిన్‌ మెండుగా ఉంటుంది, ఇది కరగని ఫైబర్‌. లిగ్నిన్‌ శరీరం నుంచి కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. లిగ్నన్స్ కొలెస్ట్రాల్‌ను రక్తప్రవాహంలోకి శోషించకముందే ప్రేగులలో బంధిస్తుంది. లిగ్నాన్ పేగు గోడ గుండా వెళ్లదు.. అది మలంలోకి వెళుతుంది. దానితో కొలెస్ట్రాల్ తీసుకువెళ్తుంది. పియర్‌లో పెక్టిన్‌ మెండుగా ఉంటుంది. ఇది పేగులను బలోపేతం చేస్తుంది, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది.

ఈ పండు రోజూ తింటే.. గుండె సమస్యలు రావంట..!

యాపిల్‌..

యాపిల్‌..

ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు రెండు యాపిల్స్ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆపిల్‌లో ఫైబర్‌, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవన్నీ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఫైబర్ మన శరీరంలోకి చేరి ఫ్యాటీ యాసిడ్స్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది లివర్‌లో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. యాపిల్‌ పెక్టిన్, యాంటీఆక్సిడెంట్ల గొప్ప మూలం. రోజూ యాపిల్‌ తింటే.. క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక సమస్యల ముప్పును కూడా తగ్గిస్తుంది. (image source – pixabay)

బెర్రీస్‌..

బెర్రీస్‌..

బెర్రీస్‌లో ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా బయోయాక్టివ్ కెమికల్స్ పుష్కలంగా ఉన్నందున.. ఈ పండ్లు తింటే గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక సమస్యల ముప్పును తగ్గిస్తాయి. బెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌, న్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడేవారు.. తరచుగా బెర్రీస్‌ తీసుకుంటే మంచిది.
ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ స్ట్రాబెర్రీలను తినడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్‌ను 4 నుంచి 10% మధ్య తగ్గించవచ్చు. ఇది మాత్రమే కాదు, కొన్ని అధ్యయనాలు LDL కొలెస్ట్రాల్‌ను 13% వరకు తగ్గించగలవని స్పష్టం చేశాయి.

ద్రాక్ష..

ద్రాక్ష..

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడుతుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిపై జరిపిన ఒక అధ్యయనంలో ఎనిమిది వారాలపాటు ప్రతిరోజూ మూడు కప్పుల ఎర్ర ద్రాక్షను తిన్నవారిలో.. మొత్తం కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిందని గుర్తించారు.

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ టిప్స్‌ ఫాలో అయితే త్వరగా కరుగుతుంది..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *