[ad_1]
Stock Market Today, 07 November 2023: సానుకూల ప్రపంచ సంకేతాలు, ఆరోగ్యకరమైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో, నిఫ్టీ, గత వారంలోని 18840 కనిష్ట స్థాయి నుంచి ఇప్పటి వరకు 3% లాభాలతో మంచి రికవరీ సాధించింది. ఈ వారాంతంలో దీపావళి పండుగ ముందు మార్కెట్ పాజిటివ్‌గా కనిపిస్తోంది.
లాభపడిన అమెరికన్ స్టాక్స్
సెంట్రల్ బ్యాంక్ పాలసీ నిర్ణయం తర్వాత, ఫెడరల్ రిజర్వ్ పాలసీ మేకర్ల మార్గదర్శకాల కోసం పెట్టుబడిదార్లు ఎదురు చూస్తుండడంతో US స్టాక్స్ సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. పెద్ద మొత్తంలో బాండ్ సప్లై కూడా మార్కెట్‌ను తాకేందుకు సిద్ధంగా ఉంది. బాండ్ ఈల్డ్స్ మళ్లీ పెరగడంతో US షేర్లలో లాభాలు పరిమితం అయ్యాయి.
ఆసియా షేర్లు పతనం
రేట్ల పెంపులో ఫెడరల్ రిజర్వ్ ఫైనల్ స్టేజ్‌ను పూర్తి చేసిందా, లేదా అనే దానిపై తాజాగా సందేహాలు తలెత్తడంతో ఆసియా స్టాక్స్ క్షీణించాయి.
ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 19 పాయింట్లు లేదా 0.10 శాతం రెడ్ కలర్‌లో 19,461 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: శ్రీ సిమెంట్, ఇన్ఫో ఎడ్జ్, పవర్ గ్రిడ్. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
నైకా: బ్యూటీ అండ్ ఫ్యాషన్ రిటైలర్ నైకాను నిర్వహిస్తున్న FSN ఈ-కామర్స్, 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, ఏకీకృత నికర లాభంలో 53% వృద్ధితో రూ.7.8 కోట్లను మిగుల్చుకుంది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.5.2 కోట్లతో పోలిస్తే ఈసారి 50 శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఏకీకృత ఆదాయం రూ.1,230.82 కోట్ల నుంచి 22.4 శాతం పెరుగుదలతో రూ.1,507 కోట్లకు చేరింది.
మామాఎర్త్: వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను అందించే మామాఎర్త్ కంపెనీ షేర్లు ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయి. ఈ స్టాక్ స్వల్ప ప్రీమియంతో స్టార్టవుతుందని భావిస్తున్నారు. ఐపీవోలో ఒక్కో షేరును రూ.308-324 రేంజ్‌లో కంపెనీ కేటాయించింది.
HPCL: సెప్టెంబరు క్వార్టర్‌లో, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) రూ.5,826.96 కోట్లు లాభపడింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ కంపెనీ రూ.2,475.69 కోట్ల నికర నష్టాన్ని పోస్ట్ చేసింది.
బజాజ్ ఫైనాన్స్: అర్హత గల సంస్థాగత కొనుగోలుదార్లకు షేర్ విక్రయ కార్యక్రమాన్ని బజాజ్ ఫైనాన్స్ సోమవారం ప్రారంభించింది, ఒక్కో షేరుకు ఫ్లోస్ ప్రైస్‌ను రూ.7,533.81గా నిర్ణయించింది.
ఇమామీ: జులై-సెప్టెంబర్ కాలంలో రూ.178 కోట్ల నికర లాభాన్ని ఇమామీ ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ.864 కోట్ల ఆదాయం సంపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై 400% (రూ.4) మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
శోభా: రియల్టర్ శోభ, Q2 FY24లో రూ.14.9 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది. అయితే, ఏడాది ప్రాతిపదికన ఇది 22% తగ్గింది. రెండో త్రైమాసికంలో ఆదాయం రూ.741 కోట్లుగా ఉంది.
అతుల్ లిమిటెడ్: కంపెనీ షేర్ల బైబ్యాక్ ప్రపోజల్‌ను పరిశీలించేందుకు అతుల్ డైరెక్టర్ల బోర్డ్ ఈ రోజు సమావేశం అవుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఈ ఆదివారం స్టాక్ మార్కెట్‌లో స్పెషల్ ట్రేడింగ్, కేవలం గంట పాటు అనుమతి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply