[ad_1]
Stock Market Holidays in November 2023: స్టాక్ మార్కెట్‌కు మరోమారు లాంగ్ వీకెండ్ వచ్చింది. సాధారణ సెలవుల్లో భాగంగా శనివారం & ఆదివారం క్లోజయిన మన మార్కెట్లు, ఇవాళ (సోమవారం, నవంబర్ 27, 2023) కూడా పని చేయవు. గత ట్రేడింగ్ సెషన్ (శుక్రవారం) తర్వాత వరుసగా 3 రోజులు ట్రేడింగ్ ఆగిపోయింది.
ఈ రోజు గురునానక్ జయంతి (Guru Nanak Jayanti 2023 Holiday) సందర్భంగా జాతీయ సెలవు దినం. కాబట్టి, విద్యాసంస్థలు, బ్యాంక్‌లు వంటి వాటితో పాటు స్టాక్ మార్కెట్లకు కూడా హాలిడే ఇచ్చారు. కాబట్టి, ఈ రోజు బుల్స్ & బేర్స్ సైలెంట్‌గా ఉంటాయి. మన మార్కెట్లు మళ్లీ మంగళవారం (నవంబర్ 28, 2023) ఓపెన్ అవుతాయి. కానీ, అమెరికన్, యూరోప్, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల మార్కెట్లు సోమవారం పని చేస్తాయి. మన దగ్గర సెలవు ఉన్నా మిగిలిన గ్లోబల్ మార్కెట్లలో ట్రేడింగ్ నడుస్తుంది కాబట్టి, ఇండియన్ మార్కెట్‌లోని ఈ లాంగ్-వీకెండ్‌లోనూ F&O పొజిషన్లు క్యారీ చేస్తున్న వాళ్లపై మంగళవారం ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ రోజు, బాంబే స్టాక్ ఎక్సేంజ్ BSE, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ NSEలో ట్రేడింగ్ జరగదు. ఈక్విటీ సెగ్మెంట్, డెరివేటివ్ సెగ్మెంట్, SLB సెగ్మెంట్ సహా అన్ని విభాగాల్లోనూ ప్రొసీడింగ్స్ ఉండవు.
MCXలో ఒక పూట ట్రేడింగ్
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ MCX (Multi Commodity Exchange) మాత్రం ఈ రోజు ఒక పూట పని చేస్తుంది. ఉదయం సెషన్‌లో MCX మూతపడుతుంది, ఈవెనింగ్ సెషన్‌లో ఓపెన్ అవుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 11:30 గంటల వరకు, MCX లో ఈవెనింగ్ సెషన్‌లో లావాదేవీలు జరుగుతాయి. దేశంలోని అతి పెద్ద అగ్రికల్చరల్ కమొడిటీ ఎక్సేంజ్ NCDEX (Agricultural Commodity Exchange) రెండు సెషన్లలోనూ క్లోజ్ అవుతుంది.
డిసెంబర్‌లోనూ ఒక లాంగ్ వీకెండ్
గురునానక్ జయంతి సెలవుతో, నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్ వార్షిక సెలవులు ముగుస్తాయి. ఈ ఏడాదిలో మరొక్క సెలవు మిగిలి ఉంది, అది క్రిస్మస్ పండుగ. డిసెంబర్ 25న, క్రిస్మస్ సందర్భంగా (Christmas 2023 Holiday) స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. ఈ ఏడాది క్రిస్మస్ కూడా సోమవారమే (Christmas December 25, 2023 Monday) వచ్చింది. అప్పుడు కూడా లాంగ్ వీకెండ్‌ను చూస్తాం. డిసెంబర్ 23న శనివారం, 24 ఆదివారం, 25న సోమవారం క్రిస్మస్ సందర్భంగా వరుసగా మూడు రోజులు మార్కెట్లు పని చేయవు.
మొత్తం క్యాలెండర్ ఇయర్‌లో (2023) ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి 15 వార్షిక సెలవులు (శని, ఆదివారాలు కాకుండా) వచ్చాయి, గత సంవత్సరం కంటే రెండు ఎక్కువ. ఈ ఏడాది శని, ఆదివారాల్లోనే నాలుగు ప్రత్యేక సెలవులు కలిసిపోయాయి. అవి.. మహాశివరాత్రి, ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్), మొహర్రం, దీపావళి. ఈ పండుగలు శని, ఆదివారాల్లో రాకుంటే, ఆయా రోజుల్లోనూ ట్రేడింగ్ (non-trading days) నిలిపేస్తారు.
లాంగ్ వీకెండ్‌కు ముందు, శుక్రవారం (నవంబర్ 24, 2023) నాడు మన మార్కెట్‌లో ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. IT & FMCG స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి వల్ల.. హెడ్‌లైన్ సూచీలు S&P BSE సెన్సెక్స్, నిఫ్టీ 50 లోయర్ సైడ్‌లో క్లోజ్ అయ్యాయి. NSE నిఫ్టీ 7.30 పాయింట్లు లేదా 0.037% తగ్గి 19,795 స్థాయి వద్ద ముగిసింది. BSE సెన్సెక్స్ 47.77 పాయింట్లు లేదా 0.072% కిందకు దిగి 65,970 స్థాయిలో ముగిసింది.
[ad_2]
Source link
Leave a Reply