ఈ వారానికి శుభారంభం, 470 పాయింట్ల జంప్‌తో 64,800 దాటిన సెన్సెక్స్

[ad_1]

Share Market Opening on 06 November 2023: ఈ వారం మొదటి ట్రేడింగ్ రోజు ‍‌శుభప్రదమైన సిగ్నల్‌ ఇచ్చింది, ఇండియన్ స్టాక్ మార్కెట్లు గ్యాప్‌-అప్‌లో ఓపెన్‌ అయ్యాయి. సెన్సెక్స్ 64,800 పాయింట్లను, నిఫ్టీ 19300 స్థాయిని దాటింది.

దేశీయ మార్కెట్ ప్రారంభం ఇలా..
ఈ రోజు (సోమవారం, 06 నవంబర్‌ 2023) ఓపెనింగ్‌ ట్రేడ్‌లో, BSE సెన్సెక్స్ 471 పాయింట్లు లేదా 0.73 శాతం పెరుగుదలతో 64,835 స్థాయి వద్ద ప్రారంభమైంది. NSE నిఫ్టీ 115.25 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో 19,345 స్థాయి వద్ద మొదలైంది.

సెన్సెక్స్ ప్యాక్‌ పరిస్థితి
మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 29 షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. Q2 FY24 ఫలితాల్లో మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయిన స్టేట్‌ బ్యాంక్‌ షేర్లు మాత్రమే రెడ్‌ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. లాభపడిన కౌంటర్లలో.. యాక్సిస్ బ్యాంక్ 1.16 శాతం, L&T 1.10 శాతం పెరిగాయి. నెస్లే 1.05 శాతం, ICICI బ్యాంక్ దాదాపు 1 శాతం చొప్పున గ్రీన్‌లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.83 శాతం, HCL టెక్ 0.80 శాతం లాభంతో కనిపించాయి.

నిఫ్టీ ప్యాక్‌ పరిస్థితి
నిఫ్టీ 50 ప్యాక్‌లోని 47 పేర్లు లాభాల్లో ఉండగా, 2 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఒక కౌంటర్‌ ఎటువంటి మార్పు లేకుండా ట్రేడవుతోంది. నిఫ్టీలో, రెడ్‌ జోన్‌లో ఉన్న రెండు షేర్లు SBI, ONGC.

అడ్వాన్స్-డిక్లైన్ రేషియో
ఈ రోజు మార్కెట్‌లో, 2,161 షేర్లు అడ్వాన్స్‌ అయితే, 713 షేర్లు డిక్లైన్ అయ్యాయి. 137 షేర్లు ఎటువంటి మార్పు లేకుండా కనిపిస్తున్నాయి. మొత్తం 3,011 షేర్లు ప్రస్తుతం BSEలో ట్రేడ్ అవుతున్నాయి.

ప్రి-మార్కెట్ చిత్రం
సెన్సెక్స్ 387.31 పాయింట్లు లేదా 0.60 శాతం పెరుగుదలతో 64,751 స్థాయి వద్ద ట్రేడయింది. నిఫ్టీ 24.55 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 19255 వద్ద ట్రేడయింది.

ఉదయం 9,50 గంటల సమయానికి, నిఫ్టీ 100.65 పాయింట్లు లేదా 0.52% గ్రీన్‌ మార్క్‌తో 19,331 స్థాయి వద్ద కదులుతోంది. సెన్సెక్స్‌ 336.73 పాయింట్లు లేదా 0.52% లాభంతో 64,700 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

పెరిగిన US స్టాక్స్
వాల్ స్ట్రీట్ ప్రధాన స్టాక్ ఇండెక్స్‌లు శుక్రవారం ర్యాలీ చేసాయి. USలో ఉద్యోగాల వృద్ధి మందగించడం, నిరుద్యోగంలో పెరుగుదల సంకేతాలు రావడంతో బాండ్ ఈల్డ్స్‌ బాగా పడిపోయాయి. ఫెడరల్ రిజర్వ్, తన వడ్డీ రేటు పెంపును పూర్తి చేస్తుందన్న ఆశలను జాబ్‌ డేటా పెంచింది.

లాభపడిన ఆసియా షేర్లు
వడ్డీ రేట్ల సైకిల్ పీక్‌ స్టేజ్‌కు దగ్గరగా ఉన్నాయని మదుపరుల్లో విశ్వాసం కలగడంతో, US స్టాక్స్‌ను అనుసరించి ఆసియాలో షేర్లు ముందుకు దూసుకెళ్లాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *