ఈ స్మాల్‌ క్యాప్స్‌తో సాలిడ్‌ రిటర్న్స్‌, వారంలో రెండంకెల రాబడి

[ad_1]

Smallcap Stocks: గ్రాస్‌ ఎనకమిక్‌ డేటా గట్టిగా ఉండడం, విదేశీ ఇన్‌ఫ్లోస్‌ సునామీలా వచ్చి పడుతుండడంతో ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు ఈ వారంలో సాలిడ్‌ ర్యాలీ చేశాయి. ఈ వారంలో (జులై 17-21 తేదీల్లో), 68 స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌ రెండంకెల రాబడి అందించాయి. ఈ లిస్ట్‌లోని 4 స్క్రిప్స్‌ ఈ ఐదు రోజుల్లోనే 25% పైగా పెరిగాయి.

డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ (DCM Shriram Industries) దాదాపు 32% గెయిన్‌తో స్మాల్‌ క్యాప్ ప్యాక్‌లో టాప్ గెయినర్‌గా ఉంది. దీని తర్వాత.. స్టెర్లింగ్ అండ్‌ విల్సన్ (Sterling and Wilson – 26.6%), అరిహంత్ క్యాపిటల్ (Arihant Capital – 26.55%), డీబీ కార్పొరేషన్ (DB Corp – 25.03%) క్యూలో ఉన్నాయి.

మిష్టన్ ఫుడ్స్ (Mishtann Foods), జై బాలాజీ ఇండస్ట్రీస్ (Jai Balaji Industries), ఆషాపురా మైన్‌కెమ్ ( Ashapura Minechem), న్యూజెన్ సాఫ్ట్‌వేర్ ‍‌(Newgen Software), జగ్రన్ ప్రకాశన్ (Jagran Prakashan), ఎల్‌టీ ఫుడ్స్ (LT Foods) సహా మరో 12 కౌంటర్లు ఈ వారంలో 20-25% మధ్య లాభపడ్డాయి.

రెండంకెల రాబడి ఇచ్చిన టాప్‌-20 స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌: 

DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ —————————— 32%
స్టెర్లింగ్ అండ్‌ విల్సన్ రెన్యువబుల్ ఎనర్జీ ———— 27%
అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ ———————– 27%
DB కార్పొరేషన్ —————————————- 25%
మిష్టన్ ఫుడ్స్ —————————————— 25%
జై బాలాజీ ఇండస్ట్రీస్ ——————————— 25%
ఆషాపురా మైన్‌కెమ్ ———————————– 25%
న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ ———————– 25%
జగ్రన్ ప్రకాశన్ —————————————- 24%
సెరెబ్రా ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్ ——————- 24%
దొడ్ల డైరీ లిమిటెడ్ ———————————– 24%
LT ఫుడ్స్ ———————————————- 23%
ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా ————————– 23%
టెక్స్‌మాకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & హోల్డింగ్స్ ———— 22%
హెరిటేజ్ ఫుడ్స్ ————————————– 21%
జిందాల్ సా —————————————— 20%
రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ————————— 20%
ప్రికోల్ ———————————————– 19%
అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ————— 18%
GTPL హాత్‌వే —————————————- 18%

మిడ్‌ క్యాప్ సెగ్మెంట్‌లో పాలిక్యాబ్ ఇండియా, ఎంఫసిస్, యూనియన్ బ్యాంక్ షేర్లు మాత్రమే ఈ వారంలో డబుల్‌ డిజిట్‌ చేరకున్నాయి. పాలీక్యాబ్ 18.3% లాభపడగా, ఎంఫసిస్ 12%, యూనియన్ బ్యాంక్ 11% గెయిన్‌ అయ్యాయి.

సెన్సెక్స్‌ ప్యాక్‌లో.. బ్యాంకింగ్‌ షేర్లు కోటక్‌, ఎస్‌బీఐ లాభాల్లో ముందడుగు వేయగా; ఎల్‌&టీ, ఎన్‌టీపీసీ తర్వాతి ప్లేస్‌ల్లో ఉన్నాయి.

ఈ వారంలోని మొదటి నాలుగు రోజుల్లో హెడ్‌లైన్‌ ఇండెక్స్‌లు రికార్డు బద్దలు కొట్టే స్పీడ్‌లో పెరిగాయి. చివరి రోజు శుక్రవారం నాడు, అదే స్పీడ్‌లో బొక్కబోర్లా పడ్డాయి. దీంతో, నిఫ్టీ 20,000 మార్కెట్‌ చేరుతుందన్న దలాల్‌ స్ట్రీట్‌ ఆశలు అడియాశలయ్యాయి. శుక్రవారం రోజు దాదాపు 10% పతనమైన ఇన్ఫోసిస్ స్టాక్‌, నిఫ్టీ50 ఇండెక్స్‌ను కిందకు లాగింది. 

మరో ఆసక్తికర కథనం: 28% జీఎస్‌టీ “గేమ్స్” వద్దు- ప్రధానికి ఇన్వెస్టర్ల లేఖ – బంతి ఇప్పుడు మోదీ కోర్టులో!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *