[ad_1]
సైలెంట్ కిల్లర్స్..
సాధారణంగా ఏవైనా సమస్యలు వస్తే అవి కొన్ని లక్షణాలతో వస్తాయి. ఆ లక్షణాలని గమనించి ఆ సమస్య గురించి ముందుగానే తెలుసుకోవచ్చు. కానీ, కొన్ని ఎలాంటి లక్షణాలు లేకుండానే వస్తాయి. వీటినే సైలెంట్ కిల్లర్స్ వీటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
షుగర్ వ్యాధి..
డయాబెటిస్ కూడా అతి ప్రమాదకర సమస్య. ఇది పేషెంట్ రక్తప్రవాహంలో గ్లూకోజ్, బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేయనప్పుడు, శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ని సమర్థవంతంగా ఉపయోగించలేనప్పుడు వస్తుందని మాయో క్లినిక్ చెబుతోంది.
Also Read : Diabetes Test : షుగర్ లెవల్స్ కచ్చితంగా తెలియాలంటే ఈ టైమ్‌లోనే టెస్ట్ చేయండి..
హై కొలెస్ట్రాల్..
భయంకరమైన సమస్యల్లో హై కొలెస్ట్రాల్ కూడా ఒకటి. ఇది సాధారణంగా ఉండేంత వరకు పర్లేదు. కానీ, ప్రమాదకర స్థాయికి వెళ్ళే వరకూ ఈ సమస్య ఎలాంటి లక్షణాలను చూపించదు. రక్తంలో చెడు కొలెస్ట్రాలు పేరుకుపోయినప్పుడు కొవ్వులా ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆల్కహాల్, ధూమపానం వంటి అలవాట్లతో పాటు శరీరాన్ని కష్టపెట్టకుండా వర్కౌట్ చేయనప్పుడు వస్తుంది.
Also Read : Vitamin D supplements : విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. జాగ్రత్త..
హైబీపి
హైబీపి, హైపర్ టెన్షన్ రెండు కూడా ఒకటే. ఆల్ టైమ్ సైలెంట్ కిల్లర్స్‌లో ఒకటిగా ఉంది. రక్త నాళాల గోడలకు వ్యతిరేకంగా బ్లడ్ స్థిరంగా ఉన్నప్పుడు ఇది వస్తుంది. దీని వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. దీనిని కనుక్కోపోతే గుండెసమస్యలు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. హైబీపి ఉన్నవారు ఒత్తిడి ఎక్కువగా ఉంటే తప్ప లక్షణాలు ఉండవు.
క్యాన్సర్స్..
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా క్యాన్సర్స్ పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి, వీటి విషయంలో జాగ్రత్తలు ఉండాల్సిందే. రోజురోజుకి బ్రెస్ట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, పెల్విక్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్స్ కేసులు ఇలా చాలా పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కూడా సైలెంట్ కిల్లర్స్. ఇవన్నీ కూడా ఎలాంటి లక్షణాలు లేకుండానే వస్తాయి. ముందుగా వీటిని టెస్ట్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు.
ఫ్యాటీ లివర్ డిసీజ్..
ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా కాలేయానికి వచ్చే సమస్యలు. ఇవి రెండు రకాలుగా ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ అని కూడా ఉంటారు. NAFLD అనేది ఓ రకమైన ఫ్యాట్ లివర్ ప్రాబ్లమ్. ఆల్కహాల్ తీసుకోకపోయినా వస్తుంది. అయితే, AFLD అనేది ఎక్కవగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుంది. ఫ్యాటీ లివర్ రోజులు మారే కొద్ది పెరుగుతుంది. ఇది కూడా సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Relationship News and Telugu News
[ad_2]
Source link
Leave a Reply