ఉదయం పూట ఈ డ్రింక్స్‌ తాగితే.. మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు దూరం అవుతాయ్‌..!

[ad_1]

​Morning Drinks: ఉదయం పూట మన దినచర్య ఆరోగ్యకరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్నింగ్‌ రొటీన్‌ మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని హెల్తీ డ్రింక్స్‌ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా.. మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌, డయాబెటిస్‌ వంటి అనేక సమస్యలను నివారించవచ్చని అంటున్నారు. ఉదయం పూట ఎలాంటి డ్రింక్స్‌ తీసుకోవాలో ప్రముఖ పోషకాహార నిపుణురాలు మాన్సీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్‌ చేశారు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఆ పానీయాలు ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం.

మార్నింగ్‌ డ్రింక్స్‌..

మెంతుల వాటర్..

మెంతుల వాటర్..

మెంతులలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మెంతులలో రైబోఫ్లావిన్‌, కాపర్‌, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, ఫోలిక్‌ యాసిడ్‌తో పాటు.. విటమిన్‌ ఎ, బి6, సి, కె వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డయాబెటిక్‌ పేషెంట్స్‌, టైప్‌ – 2 డయాబెటిస్‌ను నివారించిడానికి మెంతులు నానబెట్టిన నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. మెంతులలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఒక చెంచా మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టిండి. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగి, మెంతులు మింగేయండి. ఈ డ్రింక్‌ ఎసిడిటీకి చెక్‌ పెడుతుంది, కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది, పీరియడ్‌ క్రాంప్స్‌, అధిక బరువు వంటి సమస్యలను దూరం చేస్తుంది.

Also read: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ అనారోగ్యాలు దూరం అవుతాయి..!

కిస్‌మిస్‌ వాటర్‌..

కిస్‌మిస్‌ వాటర్‌..

ప్రస్తుత లైఫ్‌స్టైల్‌ కారణంగా ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య గ్యాస్ట్రిక్‌, ఎసిడిటీ. కొన్ని సార్లు గ్యాస్ట్రిక్‌ వల్ భయంకరమైన నొప్పి వస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని కిస్‌మిస్‌లను నీటిలో వేసి, రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లు తాగి, కిస్‌మిస్‌ నమిలి తినండి. కిస్‌మిస్‌లో క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, సి-విటమిన్‌ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయం పూట ఈ వాటర తాగితే.. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది, రక్తహీనత తగ్గుతుంది, పైల్స్‌ సమస్య దూరం అవుతుంది, ఎముకల దృఢంగా మారతాయి.

Also Read: కిస్‌మిస్‌ నానబెట్టి తింటే.. కేన్సర్‌ రాదా..?

చియా సీడ్స్‌..

చియా సీడ్స్‌..

చియా సీడ్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, కరిగే ఫైబర్‌, ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్‌లోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ ఎముకల ఆరోగ్యాన్నికి మేలు చేస్తాయి. ఇది ఆస్టియోపోరోసిస్‌ సమస్యను నివారిస్తుంది. ఒక స్పూన్‌ చియా సీడ్స్‌ను గ్లాస్‌ వాటర్‌లో వేసి కొంత సేపు నానబెట్టండి, ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగండి. చియా సీడ్స్‌లోని ఫైబర్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. చియా సీడ్‌ వాటర్‌ గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.

Also Read: బరువు తగ్గాలంటే ఏం తినాలి.. ఏం తినకూడదు..

అలీవ్‌ వాటర్‌..

అలీవ్‌ వాటర్‌..

ఐరన్‌, ఫోలికామ్లం, విటమిన్‌ ‘ఎ’, విటమిన్‌ ‘ఇ’, ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తాయి. అలీవ్‌ గింజలను నీటిలో రాత్రంతా నానబెట్టి.. ఉదయం పూట ఆ నీళ్లు తాగండి. రోజూ ఈ నీళ్లు తాగితే.. స్ట్రెస్‌ తగ్గుతుంది, సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. క్యాన్సర్‌ చికిత్స తీసుకునే వాళ్లు ఈ వాటర్‌ తాగితే.. కీమోథెరపీ వల్ల మంచి కణజాలాలపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు.

ఆప్రికాట్‌ వాటర్‌..

ఆప్రికాట్‌ వాటర్‌..

డ్రై ఆప్రికాట్‌ను నీటిలో నానబెట్టి తాగితే అనేక ఆరోగ్యా ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఆప్రికాట్‌లో పొటాషియం, ఐరన్‌, బీటా కెరోటిన్‌, ఫైబర్‌తో పాటు విటమిన్‌ సి.. వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఆప్రికాట్‌ శరీరంలో ద్రవాల స్థాయులు తగ్గకుండా చేస్తుంది. మలబద్ధకం.. వంటి పలు జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. రక్తహీనత, చర్మ సమస్యలు దూరం అవుతాయి.

(image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *