ఏం తింటే పీసీఓఎస్ తగ్గుతుందంటే..

[ad_1]

PCOS ఉంటే అనేక సమస్యలు ఉంటాయి. దీనిని కనుక్కోవడం, ట్రీట్‌మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా కొన్ని లక్షణాల ద్వారా ఈ సమస్యను గుర్తించొచ్చు. అదే విధంగా కొన్ని PCOS ఉన్నవారు ఏం తినాలి. ఏం తినకూడదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

​లక్షణాలు..

  • మొటిమలు
  • అవాంఛిత రోమాలు
  • బట్టతల

PCOS సమస్య ఉన్నవారికి ప్రత్యేకంగా ఎలాంటి లక్షణాలు ఉండవు. ఈ కారణంగా దీనిని కనుక్కోవడం కాస్తా కష్టమేనని చెప్పొచ్చు. అదే విధంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి PCOS ఉంటే అది ప్రమాదంగా మారుతుంది. ఈ సమస్యలు ఏంటంటే..

  • గుండె సమస్యలు
  • ఎండోమెట్రియల్ క్యాన్సర్
  • షుగర్
  • హైబీపి

Also Read : Weight Loss Teas : పడుకునే ముందు ఈ టీలు తాగితే ఈజీగా బరువు తగ్గుతారట..

ఆహారం ఎలా ఎఫెక్ట్ చూపుతుంది.

అయితే, ఇక్కడ ఓ విషయం గురించి మాట్లాడాలంటే, PCOS ఉన్న వారు ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ప్రమాదం నుంచి తప్పించుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

PCOS ఉన్నవారు సాధారణంగా ఇన్సులిన్ స్థాయిల కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తారు. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్‌లో ఉత్పత్తి అయ్యే హార్మోన్. ఇది శరీరంలోని కణాలను చక్కెర శక్తిగా మార్చడంలో సాయపడుతుంది. మీరు తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోతే, మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగొచ్చు. మీరు ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటే ఇది కూడా జరుగుతుంది. అంటే ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ని మీరు వాడలేరు.

ఇన్సులిన్ అధిక స్థాయిలు మీ అండాశయాలు టెస్టోస్టెరాన్ వంటి ఆండ్రోజెన్లను ఉత్పత్తి చేసేందుకు కారణమవుతాయి.

బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. ఇన్సులిన్ నిరోధకత కారణం బరువు తగ్గరు. అందుకే PCOS ఉన్నవారు అధిక బరువుతో బాధపడతారు.

వీరు పిండి పదార్థాలు, చక్కెర, ప్రాసెస్డ్, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్‌కి దూరంగా ఉండడం మంచిది. దీంతో బరువును సరిగ్గా మెంటెయన్ చేయగలరు.

Also Read : Stroke : ఈ బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారికి స్ట్రోక్ ఎక్కువగా వస్తుందట..

​ఏమేం తినొచ్చు..

ఫైబర్ ఫుడ్

  • బ్రోకలీ
  • చేపలు
  • లీన్ ప్రోటీన్
  • పసుపు
  • టమాట
  • కాలీఫ్లవర్
  • మొలకలు
  • పాలకూర
  • ఆకుకూరలు
  • క్యాప్సికమ్
  • చిలగడదుంపలు
  • గుమ్మడికాయ
  • టోపు

వీటితో పాటు బాదం, అక్రోట్స్, ఆలీవ్ ఆయిల్, బెర్రీస్ సాల్మన్, సార్డినెస్ వంటి ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలు.

Also Read : Winter Fashion : చలికాలంలో ఇవి వేసుకుంటే మీ లుక్‌కి అంతా ఫిదా..

​ఇవి వద్దు..

వైట్ బ్రెడ్, మఫిన్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. స్నాక్స్, డ్రింక్స్, రెడ్ మీట్, కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని పెంచుతాయి. అందుకే వాటిని తగ్గించాలి.

వైట్ బ్రెడ్, మఫిన్స్, డిసెర్టస్ , నూడుల్స్ ఇలా ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఫైబర్ తక్కువగా ఉంటాయి. మైదాతో తయారైనవి కాకుండా మీరు గోధుమ పిండితో ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవచ్చు.

చక్కెరని ఎంత తగ్గిస్తే అంత మంచిది.

అయితే, చక్కెర వివిధ రూపాల్లో ఉంటుంది. ఉదాహారణకు సుక్రోజ్, ఫక్ట్రోస్, డెక్ట్సోస్ లేబుల్‌పై ఇవి మెన్షన్ చేస్తే వీటికి దూరంగా ఉండడమే మంచిది. అదే విధంగా సోడా, చక్కెర ఎక్కువగా ఉన్న డ్రింక్స్, జ్యూస్ తగ్గించాలి. ఫ్రైస్, డాల్డా, రెడ్ మీట్‌కి దూరంగా ఉండాలి.

అయితే, వీటిని ఏవైనా తినేముందు, మానే ముందు డాక్టర్‌ని సంప్రదించి వారి సలహా తీసుకుని మీ డైట్‌లో చేంజెస్ చేయడం మంచిది.

​తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వర్కౌట్ ఆరోగ్యానికి ఎప్పుడు మంచిది. కార్బోహైడ్రేట్స్ తగ్గించి వర్కౌట్ చేసినప్పుడు ఆటోమేటిగ్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి వారానికి కనీసం 150 నిమిషాల వర్కౌట్ మంచిదని గుర్తుపెట్టుకోండి.

రోజువారీ పనులు, తక్కువగా చక్కెర తీసుకోవడం బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి. అదే విధంగా ఒత్తిడి తగ్గేలా చూడాలి. మనస్సుని ప్రశాంతంగా మార్చుకోండి. యోగా, ధ్యానం చేయండి. ఇలాంటి అన్ని మార్పుల ద్వారా సమస్యను దూరం చేసుకోవచ్చు.

ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెుగ్గా మారి ఇన్సులిన్ నిరోధకతను ఎదుర్కోవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *