[ad_1]
Crayons Advertising IPO: అడ్వర్టైజింగ్ ఏజెన్సీ క్రేయాన్స్ అడ్వర్టైజింగ్, ‘ప్రైవేట్’ ముద్రను వీడి ‘పబ్లిక్’లోకి రాబోతోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) కోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను (DRHP) ఈ కంపెనీ దాఖలు చేసింది. రూ. 10 ముఖ విలువ కలిగిన 64,30,000 ఫ్రెష్ ఈక్విటీ షేర్లను ఈ ఇష్యూ ద్వారా కంపెనీ జారీ చేస్తుంది.
ఈ కంపెనీ NSE Emerge (NSE SME) గ్రూప్ కింద లిస్ట్ అవుతుంది. అంటే, లిస్టింగ్ తర్వాత కూడా షేర్లను ఇష్టం మన వచ్చిన సంఖ్యలో కొనడానికి వీలుండదు. లాట్స్‌లోనే ఈ కంపెనీ షేర్లను కొనాలి, లాట్స్‌లోనే అమ్మాలి. ఈ కంపెనీ IPO తేదీలు, ప్రైస్ బ్యాండ్ సహా ఇతర వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
మూడున్నర దశాబ్దాల క్రితం ప్రారంభమైన క్రేయాన్స్ అడ్వర్టైజింగ్‌ను కునాల్ లలానీ ప్రమోట్ చేస్తున్నారు. బ్రాండ్ స్ట్రాటజీ, క్రియేటివ్ సొల్యూషన్స్, ఈవెంట్స్ & యాక్టివేషన్స్, డిజిటల్ మీడియా, సాంప్రదాయ మీడియా ప్లానింగ్ & బయింగ్ వంటి వివిధ రకాల సర్వీసులను ఈ కంపెనీ అందిస్తోంది. IPO ద్వారా వచ్చే ఆదాయాన్ని మౌలిక సదుపాయాల కల్పనకు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి (రూ. 15.28 కోట్లు) & వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు (రూ. 14.50 కోట్లు) వినియోగిస్తామని ఈ కంపెనీ ప్రకటించింది.
కంపెనీ ఆర్థిక చరిత్ర
ఈ కంపెనీ నికర విలువ (net worth) దాదాపు రూ. 43 కోట్లు. 2022 సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 118 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. ఇదే కాలంలో ‘పన్ను తర్వాతి లాభం (PAT) రూ. 6.55 కోట్లుగా ఉంది. ఒక్కో షేరు మీద ఆదాయం (earnings per share) రూ. 29.11 వద్ద ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 1 కోటి నికర లాభాన్ని, రూ. 194 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
పెద్ద కంపెనీలు ఈ ఏజెన్సీ కస్టమర్లు
టాటా సన్స్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్, టాటా క్రోమా, బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా పెద్ద పెద్ద కంపెనీల నుంచి మాండేట్లను గెలుచుకున్నట్లు ఇటీవల ఈ కంపెనీ ప్రకటించింది. అంటే, ఆయా కంపెనీలు అప్పగించిన నిర్ధిష్ట పనులు లేదా కార్యక్రమ ప్రచారాలను వాటి తరపున క్రేయాన్స్ అడ్వర్టైజింగ్ చేస్తుంది. బ్రాండ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చి, యువతను ఆకర్షించడం కోసం నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాండేట్ ఇచ్చింది. టాటా గ్రూప్ కంపెనీల విషయానికి వస్తే.. టాటా సన్స్ కోసం సోషల్ మీడియా మాండేట్‌ను పొందింది. గత రెండు సంవత్సరాల్లో, టాటా గ్రూప్ కోసం అనేక కీలక ప్రచారాలు నిర్వహించింది.
టాటా ముంబై మారథాన్ ప్రచారంలో కూడా క్రేయాన్స్ పని చేసింది. గత సంవత్సరంలో, ఎయిర్ ఇండియా ట్రాన్సిషన్ క్యాంపెయిన్ ‘వింగ్స్ ఆఫ్ చేంజ్’ని (‘Wings of Change’) ప్రారంభించడానికి, టాటా క్రోమా మాండేట్‌ను నిర్వహించడానికి క్రేయాన్స్ అడ్వర్టైజింగ్‌ను టాటా గ్రూప్ నియమించింది. నిపుణుల మార్కెట్ రీసెర్చ్ ప్రకారం… 2020లో భారతదేశ అడ్వర్టైజింగ్ మార్కెట్ విలువ దాదాపు రూ. 67,000 కోట్లుగా ఉంది. 2022-27 కాలంలో 11% CAGR వద్ద వృద్ధి చెంది 2026 నాటికి రూ. 1.25 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply