ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఫెసిలిటీ, ‘పే లేటర్‌’ను EMIల్లోకి మార్చుకోవచ్చు

[ad_1]

EMI on UPI Payments: ICICI బ్యాంక్ కస్టమర్లకు ఇది శుభవార్త. ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదార్లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా చేసే ‘పే లేటర్‌’ చెల్లింపులకు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (EMI) సౌకర్యం పొందవచ్చని బ్యాంక్‌ ప్రకటించింది. ICICI బ్యాంక్‌ “బయ్‌ నౌ – పే లేటర్‌” (BNPL) ద్వారా చేసే UPI చెల్లింపులను ఇకపై నెలవారీ వాయిదాల్లోకి మార్చుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న పద్ధతి ప్రకారం, “బయ్‌ నౌ – పే లేటర్‌” మార్గంలో ఏదైనా వస్తువు కొన్నప్పుడు, ఆ మొత్తాన్ని తిరిగి ఏకమొత్తంగా బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంటుంది. దీనినే నెలవారీ వాయిదాల పద్ధతిలోకి మార్చుకునే సౌకర్యాన్ని ఐసీఐసీఐ బ్యాంకు తీసుకొచ్చింది.

కొత్త ఫెసిలిటీ ఎవరి కోసం?
‘బయ్‌ నౌ – పే లేటర్‌’ వినియోగదార్లకు ఇది వర్తిస్తుంది. ICICI బ్యాంక్ కస్టమర్‌ ఏదైనా స్టోర్‌కు వెళ్లి, QR కోడ్‌ని స్కాన్ చేసి “బయ్‌ నౌ – పే లేటర్‌”తో UPI ద్వారా చెల్లింపులు చేసినప్పుడు, ఆ మొత్తాన్ని సులభమైన వాయిదాల్లోకి మార్చుకోవచ్చు.
దుస్తులు, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌, కిరాణా సామగ్రి వంటివి కొనుగోలు చేసిన బిల్లులు లేదా హోటల్‌ బుకింగ్స్‌, ప్రయాణాల కోసం బుకింగ్‌ వంటి మొత్తాలను ఐసీఐసీఐ ‘బయ్‌ నౌ – పే లేటర్‌’ ద్వారా చెల్లిస్తే, ఆ మొత్తాన్ని EMIల్లోకి మార్చుకునే సదుపాయం కనిపిస్తుంది. QR కోడ్‌ స్కాన్‌ చేసి, UPI ద్వారా చెల్లించినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.

ICICI బ్యాంక్ తీసుకొచ్చిన సదుపాయం కోసం లావాదేవీ మొత్తం రూ. 10,000 కంటే తగ్గకూడదు. అంటే, రూ. 10,000 దాటిన బిల్లులను QR కోడ్‌ స్కాన్‌ చేసి, పే లేటర్‌ను ఉపయోగించి UPI ద్వారా చెల్లిస్తే, దానిని EMIగా మార్చవచ్చు. మీ అవసరానికి అనుగుణంగా.. ఆ మొత్తాన్ని 3, 6, 9 నెలల వాయిదా ఆప్షన్స్‌లో ఒకదానిని ఎంచుకోవచ్చు. చాలామంది వినియోగదార్లు ‘పే లేటర్‌’ను ఉపయోగించి, యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని, వాళ్ల ప్రయోజనం కోసం ఉండేలా ఈఎంఐ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ డిజిటల్‌ ఛానెల్‌ హెడ్‌ బిజిత్‌ భాస్కర్‌ వెల్లడించారు.

త్వరలో ఆన్‌లైన్ షాపింగ్‌లోనూ పే లేటర్‌ EMIs
ప్రస్తుతం.. పే లేటర్‌ UPI చెల్లింపుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్‌కు EMI సౌకర్యం అందుబాటులో లేదు. ఆన్‌లైన్ షాపింగ్‌కు కూడా ఈ సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని బిజిత్‌ భాస్కర్‌ చెప్పారు. 

ICICI పే లేటర్‌ ద్వారా UPI చెల్లింపులను EMIల్లోకి ఎలా మార్చుకోవాలి?
ఉదాహరణకు, మీరు ICICI బ్యాంక్ కస్టమర్ అయితే, మీరు షాపింగ్ దుకాణానికి వెళ్లి కిరాణా సామాగ్రిని కొనుగోలు చేశారని అనుకుందాం. బిల్లు మొత్తం రూ.10,000 కంటే ఎక్కువయితే, iMobile Pay యాప్‌ ఓపెన్‌ చేయండి. QR కోడ్‌ స్కాన్‌ చేసి, పే లేటర్ EMI ఆప్షన్‌ ఎంచుకోండి. ఇందులో… 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ ఇష్టప్రకారం ఒక ఆప్షన్‌ ఎంచుకుని పే చేయండి. దీంతో ఆ లావాదేవీ పూర్తవుతుంది, ఆ మొత్తం EMIల్లోకి మారుతుంది.

ICICI బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, చెల్లించాల్సిన EMI మొత్తం మీ ICICI బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *