ఒళ్ళంతా మత్తుగా అనిపిస్తుందా.. ఈ సమస్య ఉందేమో..

[ad_1]

మద్యపానం తీసుకోకుండా, మత్తు పదార్థాల జోలికి వెళ్ళకుండానే బాడీ మొత్తం ఊగినట్లుగా ఉండడం గురించి ఎప్పుడైనా విన్నారా..ఈ వింత వ్యాధి కొంతమంది జీవితాలను ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఈ కండీషన్ ఉన్నవారు.. ఆల్కహాల్ తీసుకోకుండానే మత్తులో తూగుతున్నారు. దీనికి కారణాలు ఏంటో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు నిపుణులు. అయితే, ఇప్పటికే ఈ సమస్య వచ్చి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వీరు ఒక్క చుక్క కూడా మందు తీసుకోకుండా మత్తుగా కనిపించే లక్షణాలు ఉంటాయి.

కారణాలేంటి..

కారణాలేంటి..

ఈ వ్యాధి వచ్చిన వారికి గట్‌లో ఈస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్స్‌ని పులియబెట్టడం వల్ల ఇది వస్తుంది. దీనిని గుర్తించడం చాలా కష్టం. అందుకే ఎప్పటికప్పుడు తగిన విధంగా ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి. ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేదాన్ని చెక్ చేసుకోవాలి.
Also Read : Cardiac Arrest : కార్డియాక్ అరెస్ట్.. ఈ లక్షణాలని గమనించకపోతే ప్రాణాలకే ప్రమాదం..

లక్షణాలు..

లక్షణాలు..

ఈ సమస్య ఉన్నవారు ఒక్క మద్యం చుక్క తీసుకోకపోయినా సరిగ్గా నిలబడలేరు. ఏవేవో మాట్లాడతారు. చివరికి గాఢ నిద్రలోకి జారుకుంటారు. వారికి తాగినవాళ్ళ లక్షణాలన్నీ కనిపిస్తాయి.

మత్తు ఎక్కడంతో పాటు కడుపు నొప్పి కడుపు ఉబ్బరం, అలసట కూడా ఉంటుంది.

ఆరు, ఏడు గంటల తర్వాత తిరిగి మామూలుగానే ఉంటారు. అసలేమీ జరగనట్టుగా, హ్యాంగోవర్‌లా ఉంటుంది.

ఎందుకొస్తుంది..

ఎందుకొస్తుంది..

ఇది నిజమైన ఆరోగ్య సమస్య అని, అంతర్గతంగా ఫెర్మెంటేషన్ జరిగితే రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా అందరికీ కడుపులో కొద్దిగా ఆల్కహాల్ ఉంటుంది. ఇది పెరగడం వల్లే ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు.
Also Read : Beetroot : ఆటలు ఆడేవారు బీట్‌రూట్ తింటే ఎన్ని లాభాలంటే..

ట్రీట్‌మెంట్..

ట్రీట్‌మెంట్..

ఈ సమస్యతో బాధపడేవారికి ట్రీట్‌మెంట్‌తో మామూలుగా చేయొచ్చు. సరైన విధంగా ట్రీట్‌మెంట్ విధానంతో దీనిని గుర్తించి ట్రీట్‌మెంట్ చేయాలి. దీనికి ట్రీట్‌మెంట్ చేసేందుకు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడంతో పాటు, మెడిసిన్, ప్రోబయోటిక్స్ ఉన్న విధానం అవసరం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఒత్తిడిని తగ్గించుకోవడం, వర్కౌట్ చేయడం, లైఫ్‌స్టైల్ చేంజెస్ వల్ల సమస్య నుంచి ఉపశమనంగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించి మంచి ఆహారం తీసుకుంటూ సరైన విధంగా వర్కౌట్ చేసి సమస్యని దూరం పెట్టొచ్చు.

-Dr BS Ravindra, director, department of gastroenterology & hepatology, Fortis Hospital, Bengaluru

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Relationship News and Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *