[ad_1]
కొన్ని యోగాసనాలు ప్రాక్టిస్ చేయడం వల్ల.. వ్యక్తి కడుపు, పేగు ప్రాంతంలో చిక్కుకున్న గ్యాస్ విడుదల అవుతుందని ప్రముఖ యోగా ట్రైనర్ అంసుక పర్వాణి అన్నారు. కడుపు ఉబ్బరాన్ని దూరం చేసే 5 యోగాసనాలను మనకు వివరించారు.
కడుపు ఉబ్బరం
సేతు బంధాసనం
సేతు బంధానసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆస్తమా, ఆస్టియోపోరోసిస్, సైనసైటిస్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. మీ వెన్నెముకను దృఢంగా మారుస్తుంది.
ఇలా చేయండి..
వెల్లకిలా పడుకొని కాళ్లను తిన్నగా చాచాలి. ఇప్పుడు మోకాళ్లను వంచుతూ మడమలను శరీరానికి దగ్గరగా తీసుకురండి. చేతులతో మడమలను పట్టుకొని.. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పాదాలు, భుజాలు, తలను నేలకు నొక్కుతూ.. తొడలు, నడుము, పొట్ట, ఛాతీని పైకెత్తాలి. కాసేపు అలాగే ఉండి.. నెమ్మదిగా శ్వాసను వదులుతూ యథాస్థితికి రావాలి.
ఉత్తిత పార్శ్వ కోణాసనం..
ఈ ఆసనం ఉదర కండరాలపై పనిచేస్తుంది. ఉత్తిత పార్శ్వకోనాసనం ప్రాక్టిస్ చేస్తే.. జీర్ణక్రియ జీర్ణ రసాలను మెరుగ్గా స్రవిస్తుంది. మెకాలు, తొడలు, చీలమండలను బలోపేతం చేయడంలో ఇది సహాయపడుతుంది.
ఇలా వేయండి..
మొదట నిటారుగా నిలబడాలి. తర్వాత ఊపిరి పీల్చుకొని పాదాలు ఒక మీటరు దూరం జరపాలి. అరచేతులు భూమివైపుగా ఉంచాలి తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ కుడి పాదాన్ని కుడివైపుగా తిప్పుతూ 90 డిగ్రీల కోణంలో వంచాలి. ఈ సమయంలో ఎడమకాలును స్టిఫ్‌గా ఉంచాలి. ఇప్పుడు కుడి అరచేతిని కుడికాలి పక్కగా ఉంచి ఎడమ చేతిని ఎడమ చెవి మీదుగా భూమికి సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో అర నిమిషం పాటు ఉండాలి. తర్వాత గాలి పీలుస్తూ ముందుగా కాలును, తర్వాత చేతిని సాధారణ తీసుకురావాలి. ఇదే విధంగా ఎడమవైపు కూడా చేయాలి. మొదట్లో 15-20 సెకన్ల పాటు ఈ భంగిమను అభ్యసించాలని.. క్రమంగా వ్యవధిని 2 నిమిషాలకు పెంచాలని అన్షుక సూచిస్తున్నారు. (image source – unsplash)
కటి చక్రాసనం..
ఇది మీ నడుము కదలికపై దృష్టి సారించే యోగా భంగిమ. ఈ ఆసనం మలబద్ధకం, ఆజీర్ణం వంటి జీర్ణ సమస్యలను దూరం చేయడమే కాకుండా.. బాడీ ఫ్రెక్సిబిలిటీ పెంచుతుంది, బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.
ఇలా వేయండి..
ఈ ఆసనం వేయడానికి ముందుగా నిటారుగా నిలబడాలి. తలను స్ట్రైట్‌గా ఉంచి, ముందుకు చూడాలి. చేతులను ముందుకు చాపాలి. కాళ్ల మధ్య కనీసం అరమీటరు దూరం ఉండేలా నిలబడాలి. ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి. కుడిభుజాన్ని వెనుకకు మడవాలి. అలాగే కుడిచేతిని ఎడమ భుజంపైకి తీసుకువస్తూ ఎడమ భుజాన్ని వెనుకకు మడవాలి. కుడి భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి. ఈ స్థితిలో కొన్ని సెకనులు నిలబడాలి. ఇలాగే కొద్దసేపు నిలబడి పూర్వస్థితికి రావాలి. ఇదే విధంగా రెండోవైపు చేయాలి. ఇలా కనీసం 5 మార్లు చేయాలి.
మండూకాసనం..
మండూకాసనం అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం.. బెల్లీ ఫ్యాట్‌ను కూడా కరిగిస్తుంది.
ఇలా చేయండి..
మీ చేతులను మీ భుజాల క్రింద, మీ మోకాళ్లను మీ తుంటికి దిగువన ఉంచండి. మీ బరువును మీ చేతులపై ఉంచండి. నెమ్మదిగా, మీ మోకాళ్లను మీ తుంటికి అనుగుణంగా ఉంచి, రెండువైపులా బయటకు తీయండి. మీ మోకాళ్లను వంచి.. చీలమండలను వెనుక ఉంచండి. మీ కాలి వేళ్లను బయటకు తిప్పండి. మీ భుజాల క్రింద మీ మోచేతులతో మీ ముంజేతులపై విశ్రాంతి తీసుకోండి, మీ చేతులను కలిపి నేలపై ఉంచండి. గడ్డాన్ని నేలపై ఉంచి, మీ చేతులను ముందుకు చాచవచ్చు. లోతుగా ఊపిరి పీల్చుకుని, కొంతసేపు ఈ స్థితిలో ఉండండి.
పవనముక్తాసనం..
ఈ భంగిమ కడుపులోని గ్యాస్‌ను బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది. మలబద్ధకం, IBS వంటి ఇతర జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి ఈ ఆసనం సహాయపడుతుంది.
ఇలా వేయండి..
పడుకుని మీ ముఖాన్ని పైకి ఉంచాలి. చేతులతో కాళ్లను పట్టుకుని తోడలు, పొత్తికడుపునకు ఒత్తిడి కలిగిస్తూ మోకాళ్లు ముఖం వరకు వచ్చేలా చేయాలి. ఇలా 60 నుంచి 90 సెకన్లు ఈ భంగిమలో ఉండాలి.
గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply