కారు కొనాలనుకుంటున్నారా? మీకో బ్యాడ్ న్యూస్ !

[ad_1]

Car Prices Hike In January: మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్‌. జనవరిలో మారుతీ సుజూకి ఇండియా (Maruti Suzuki India), హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India), టాటా మోటార్స్ (Tata Motors), మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra), హోండా కార్స్ ఇండియా (Honda Cars India), ఎమ్‌జీ మోటార్ ఇండియా (MG Motor India) కార్ల తయారీ సంస్థలు కొత్త ఏడాది నుంచి తమ మోడళ్ల ధరలను భారీగా పెంచనున్నాయి. ముడి సరకు ధరలు పెరగటం, ద్రవ్యోల్బణం, కారణంగా కార్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు తెలిపాయి. 

ఈ కారణంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ ప్రయాణ వాహన ధరల్ని పెంచాల్సి వస్తోందని కంపెనీలు పేర్కొంటున్నాయి. దీంతో పెరిగిన వ్యయంలోని కొంత భారం కస్టమర్లపై సైతం పడతుందని ఆయా సంస్థలు చెబుతున్నాయి. అయితే ఎంత మొత్తంలో రేట్లు పెరుగుతాయో ఆయా కంపెనీలు ప్రకటించలేదు. కానీ మోడల్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని మార్కెట్‌ వర్గాల సమాచారం. గత కొద్ది కాలంగా కంపెనీలు క్రమంగా కార్ల ధరలు పెంచుతూనే ఉన్నాయి.  సంవత్సరానికి రెండు సార్లు కార్ల ధరలను పెంచుతున్నాయి.  

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి వాహనాల సగటు విక్రయ ధర Q2 FY23లో రూ. 5,51,677 ఉండగా Q2 FY24లో 16.7% పెరిగి రూ.6,43,688 వద్దకు చేరుకుంది. తాజాగా మారుతి తన కార్ల ధరలను జనవరి 2024లో పెంచనున్నట్లు పేర్కొంది.  కంపెనీ ఖర్చును తగ్గించడానికి, పెరుగుతున్న వ్యయాన్ని భర్తీ చేయడానికి ధరలను పెంచాల్సి వస్తుందని తెలిపింది. ఎంత శాతం పెంచేదీ వెల్లడించలేదు. మోడల్‌ను బట్టి ఈ ధరల పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల ధరల శ్రేణిలో ఆల్టో నుంచి ఇన్‌విక్టో వరకు వివిధ మోడళ్లను మారుతీ సుజుకీ విక్రయిస్తోంది.

హ్యుందాయ్ జనవరి 16న భారతదేశంలో కొత్త క్రెటాను విడుదల చేయనుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బనం, వస్తువుల ధరల పెరుగుదల వంటి ఇతర కారణాలతో జనవరి 1 నుంచి హ్యూందయ్ తన వాహనాల ధరలను పెంచనుంది. కార్ల ధరల పెంపుపై కంపెనీ COO, తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ‘హ్యుందాయ్ మోటార్ ఇండియాలో ఎప్పటికప్పుడు ధరల పెరుగుదలను గుర్తిస్తూ, కస్టమర్లకు మెరుగైన ధరలకు వాహనాలను అందిచడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. పెరుగుతున్న ఇన్‌పుట్ ధరలతో వాహనాల ధరల పెంపు అనివార్యమని పేర్కొన్నారు.  

అలాగే మహీంద్రా కంపెనీ తన యుటిలిటీ వాహనాలు (SUVలు), వాణిజ్య వాహనాల (CV) ధరలను  పెంచనుంది. జనవరి నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరల కారణం గా వ్యయాలు పెరగటంతో ధరలు పెంచాల్సి వస్తోందని పే ర్కొంది. అయితే ధరలు ఏ మేరకు పెంచుతుందనేది మాత్రం వెల్లడించలేదు. అన్ని ఎస్‌యూవీలు, వాణిజ్య వాహనాల మోడల్‌ను బట్టి పెంపు ఉంటుందని మహీంద్రా పేర్కొంది.   

జనవరి నుంచి తమ వాహనాల ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు ఆడీ తెలిపింది. జనవరి 1 నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. పెంపు ప్రభావం కస్టమర్లపై వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తామన్నారు. భారత్‌లో క్యూ3 ఎస్‌యూవీ నుంచి ఆర్‌ఎస్‌క్యూ8 వరకు ఆడీ పలు రకాల కార్లను విక్రయిస్తోంది. ధరల శ్రేణి రూ.42.77 లక్షల నుంచి రూ.2.22 కోట్ల మధ్య ఉంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *