కియా సెల్టోస్‌లో ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది – రూ.11 లక్షల లోపే – ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

[ad_1]

Kia Car: ప్రముఖ ప్రీమియం కార్ల తయారీదారు కియా ఇండియా తన కొత్త కియా సెల్టోస్‌ను రూ. 10,89,900 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ కారును కంపెనీ జూలై 4వ తేదీన మొదటిసారి పరిచయం చేసింది. కియా నుంచి వచ్చిన ఈ కొత్త ఎస్‌యూవీ మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఏకంగా 18 వేరియంట్లలో…
దీన్ని 18 వేరియంట్‌ల్లో కొనుగోలు చేయవచ్చు. దీని టాప్ వేరియంట్స్ అయిన జీటీ లైన్, ఎక్స్ లైన్ ADAS ఫీచర్, డీజిల్, పెట్రోల్ ఇంజన్‌లతో వచ్చాయి. వీటి ధర రూ. 19,79,900 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది కూడా ఎక్స్ షోరూమ్ ధరనే. కొత్త సెల్టోస్ బుకింగ్స్ మొదటి రోజునే అధిక స్పందనను పొందాయి. దాని విభాగంలో అత్యధిక సంఖ్యలో 13,424 యూనిట్లను బుకింగ్స్‌ను పొందింది.

ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి వినియోగదారులు కియా ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా రూ. 25,000కి బుక్ చేసుకోవచ్చు. కొత్త సెల్టోస్ దాని స్పోర్టియర్ స్టైలింగ్, మస్క్యులర్ ఎక్స్‌టీరియర్, ఫ్యూచరిస్టిక్ క్యాబిన్, అధునాతన టెక్నాలజీతో అద్భుతంగా ఉంది. ఈ కొత్త ఎస్‌యూవీ గురించి చెప్పాలంటే ఇది ఏడీఏఎస్‌తో పాటు 32 సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది.

వినియోగదారులకు ప్రత్యేకమైన, సురక్షితమైన, స్మార్ట్ డ్రైవ్ అనుభూతిని కొత్త సెల్టోస్ అందిస్తుంది. కొత్త సెల్టోస్ 26.04 సెంటీమీటర్ల ఫుల్లీ డిజిటల్ క్లస్టర్, 26.03 సెంటీమీటర్ల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ నావిగేషన్, డ్యూయల్ స్క్రీన్ పనోరమిక్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్, ఆర్18 46.20 సెంటీమీటర్ల క్రిస్టల్ కట్ బ్లాక్ గ్లోస్సీ ఆల్ క్రిస్టల్ కాయిస్ క్రిస్టల్ కాయిస్ అలోయ్ వీల్స్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో మిడ్ ఎస్‌యూవీ స్పేస్‌లో ఈ కారు ముందుంటుందని భావిస్తున్నారు. ఇది కాకుండా డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి మోస్ట్ అవైటెడ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇది కాకుండా ఈ SUVలోని జీ1.5 టీ-జీడీఐ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్ ఇంజన్ ఇప్పటివరకు ఈ విభాగంలో అతిపెద్ద ఆఫర్. ఇది 160 పీఎస్ పవర్‌ని, 253 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మూడు ఇంజిన్‌లు, ఐదు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో మూడు ట్రిమ్‌లలో (టెక్ లైన్, జీటీ లైన్, ఎక్స్ లైన్) లాంచ్ అయింది. కొత్త కస్టమర్‌లకు ఇది విస్తృత శ్రేణి ఆప్షన్లను అందిస్తుంది.

ఈ కారు ఆటోమోటివ్ ఇన్నోవేషన్‌లో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) లెవల్ 2కు చెందిన 17 సెక్యూరిటీ ఫీచర్లతో ఉంది. దీని సేఫ్టీ సూట్‌లో ఒక కెమెరా, మూడు రాడార్‌లు, ఫ్రంట్ కొలిషన్ అవాయిడెన్స్, లేన్ కీప్ అసిస్ట్, స్టాప్ అండ్ గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. ఇది డ్రైవర్, ప్రయాణీకులకు సమాన రక్షణను అందించడానికి పని చేస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ వంటి 15 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కూడా పొందుతుంది. ఇది కొత్త సెల్టోస్‌ను దేశంలోని సురక్షితమైన ఎస్‌యూవీల్లో ఒకటిగా చేస్తుంది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *