కివీ పండు తింటే.. హైపర్‌టెన్షన్‌ తగ్గడంతో పాటు.. ఈ ప్రయోజనాలు ఉంటాయ్‌..!

[ad_1]

Kiwi Health Benefits: కివీ.. ఇది విదేశీ పండైనా, ఇప్పుడు లోకల్‌లోనూ చాలా ఫేమస్‌ అయిపోయింది. కవీని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని చైనీస్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు. మన దేశంలో ఫుజీరకం కివి దొరుకుతుంది, ఇది పులుపు-తీపి కలగలిపిన రుచులలో ఉంటుంది. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, కివీలో విటమిన్లు A, E, C, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఒక కప్పు కివీ ముక్కలలో.. మనకు రోజుమొత్తం సరిపడా విటమిన్‌ సీ లభిస్తుంది. ఇది శరీరంలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మత్తుకు చాలా అవసరం. కివీలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఈ అద్భుతమైన పండును మీ ఆహారంలో చేర్చుకుంటే.. ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అని తెలుసుకోవాలంటే, ఈ స్టోరీ చదివేయండి.

బరువు కంట్రోల్‌లో ఉంటుంది..

బరువు కంట్రోల్‌లో ఉంటుంది..

కివీలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మీడియం-సైజ్ కివిలో దాదాపు 50 కేలరీలు ఉంటాయి. కివీలోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణవ్యస్థకు మేలు చేస్తుంది. ఇది, కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీంతో, మీరు జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినకుండా ఉంటారు. తద్వారా, బరువు కంట్రోల్‌లో ఉంటుంది. (image source – pexels)

జీర్ణక్రియకు మంచిది..

జీర్ణక్రియకు మంచిది..

USDA డేటా ప్రకారం ప్రతి 100 గ్రాముల కివీలో 3 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఇది మీరు రోజువారీ అవసరమైన ఫైబర్‌లో 12 శాతం. డైటరీ ఫైబర్ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ పండులో ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ఆక్టినిడిన్ అనే ప్రొటీయోలైటిక్ ఎంజైమ్ కూడా ఉంటుంది. ఫైబర్ మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలనూ దూరం చేస్తుంది. (image source – pexels)

ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది..

ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది..

కివీ పండులో విటమిన్‌ సీ సమృద్ధిగా ఉంటుంది. కెనడియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కివీ పండు తరచుగా తింటే.. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. కివీలోని విటమిన్‌ సీ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఇది వాపు, క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. (image source – pixabay)

ప్రశాంతమైన నిద్ర..

ప్రశాంతమైన నిద్ర..

కివీస్ నిద్రను ప్రేరేపించే సెరోటోనిన్‌ హార్మన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. సెరోటోనిన్ అనేది మీ నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడే బ్రెయిన్‌ కెమికల్‌. కివీస్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కెరోటినాయిడ్స్ వంటివి కూడా నిద్రను ప్రోత్సహిస్తాయి. (image source – pixabay)

ఎముకలు దృఢంగా..

ఎముకలు దృఢంగా..

కివీ పండులో ఎముకలను బలోపేతం చేసే ఫోలేట్‌ ఉంటుంది. ఈ ఫోలేట్‌ ఎముక నిర్మాణానికి తోడ్పుడుతుంది. ఎముకల గట్టితనానికి కివీలోని విటమిన్‌ కే కూడా బాగా సహాయపడుతుంది. అందుకే గర్భిణిల డైట్‌లో కివీ పండును తీసుకోవడం చాలా మంచిది. (image source – pixabay)

ఆస్తమా పేషెంట్స్‌కు మంచిది..

ఆస్తమా పేషెంట్స్‌కు మంచిది..

కివిలో పెద్ద మొత్తంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. . విటమిన్ సి ఆస్తమా పేషెంట్స్‌లో శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్‌ సీ శ్వాసకోశ వ్యవస్థలో అలెర్జీలకు కారణం అయ్యే.. ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. రక్తంలో రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. (image source – pixabay)

హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది..

హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది..

ప్రస్తుతం మిలియన్లమంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారపు. కివీ పండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కివీ స్ట్రోక్‌, గుండె సమస్యలు, టైప్‌ 2 డైయాబెటిస్‌ వంటి సమస్యల ముప్పును తగ్గిస్తుంది. (image source – pixabay)

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *