కొత్త టూవీలర్‌ను టీజ్ చేసిన హోండా – హోండా డియో 125 సీసీ వస్తుందా?

[ad_1]

Honda New Motorcycle: హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ఇటీవల తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రెండు కొత్త వీడియోలను పోస్ట్ చేసింది. ఈ టీజర్‌ వీడియోలను బట్టి కొత్త బైక్ లేదా స్కూటీ లాంచ్ త్వరలో ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఇది ఎటువంటి ద్విచక్రవాహనం అనేది టీజర్ నుంచి గుర్తించడం కష్టం. ఇది హోండా డియో 125కు సంబంధించిన కొత్త మోడల్ కావచ్చునని వార్తలు వస్తున్నాయి. 

ఈ వీడియోల్లో ఏం ఉంది?
హోండా షేర్ చేసిన మొదటి వీడియోలో ‘Level Up Your Style Quotient’ అని క్యాప్షన్ ఇచ్చారు. దాని సైడ్ ప్యానెల్స్‌లో స్కూటర్‌కు సంబంధించిన ఫంకీ గ్రాఫిక్స్, ఫ్లోర్‌బోర్డ్ విజువల్స్ హైలైట్ చేశారు. దీనితో పాటు హెడ్‌ల్యాంప్‌లు, ముందు మడ్‌గార్డ్‌లు కూడా చూడవచ్చు.

ఇక రెండో వీడియో విషయానికి వస్తే… రాబోయే స్కూటర్ ఎగ్జాస్ట్‌ను కంపెనీ హైలైట్ చేసింది. ప్రస్తుతం హోండా తన పోర్ట్‌ఫోలియోలో రెండు 125 సీసీ స్కూటర్‌లను కలిగి ఉంది. అవి యాక్టివా 125, గ్రాజియా 125. హోండా డియో మోడల్ 125 సీసీ సెగ్మెంట్‌లో ప్రస్తుతం అందుబాటులో లేదు. అందువల్ల దీన్ని కూడా త్వరలో 125 సెగ్మెంట్‌లో చేర్చవచ్చని భావిస్తున్నారు.

హోండా కంపెనీ 2023 జూన్ నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం కంపెనీ ద్విచక్ర వాహనాల అమ్మకాలు గత నెలలో 3,24,093 యూనిట్లుగా ఉన్నాయి. వీటిలో 3,02,756 యూనిట్లను దేశీయ మార్కెట్‌లో విక్రయించగా, 21,337 యూనిట్లు విదేశాలకు ఎక్స్‌పోర్ట్ అయ్యాయి.

ఇది మాత్రమే కాకుండా హోండా యునికార్న్, డియో, షైన్ 100, షైన్ 125లను ఓబీడీ-2 కొత్త నిబంధనలతో గత కొన్ని నెలలుగా పరిచయం చేసింది. హోండా ద్విచక్ర వాహనాలతో పోటీపడుతున్న వాటిలో హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో వంటి ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఉన్నాయి.




Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *