[ad_1]
ఓట్స్..
ఓట్స్‌లో కరిగే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయలను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఓట్స్‌లోని కరిగే ఫైబర్.. జీర్ణక్రియ సమయంలో దానితో పాటు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్‌లను తీసుకువెళుతుంది. దీంతో కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు.. వారి డైట్‌లో ఓట్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పచ్చి బఠాణీ..
పచ్చి బాఠీణీలలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయపడుతుంది. అలాగే వీటిలో నియాసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ట్రైగ్లిజరైడ్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో బఠానీలు సహాయపడతాయి. ఇవి గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.
Also Read: డయాబెటిక్ పేషెంట్స్ బఠాణీలు తింటే.. షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది..!
యాపిల్ ..
రోజుకు రెండు యాపిల్స్ తింటే.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు 40 శాతం తగ్గుతాయని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. యాపిల్‌లో పాలీఫెనాల్స్, కరిగే ఫైబర్ అధికం మొత్తంలో ఉన్నాయి. ఫైబర్ మన శరీరంలో.. ఫ్యాటీ యాసిడ్స్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది లివర్‌లో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. యాపిల్ లోని కరిగే ఫైబర్ పేగులలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.
Also Read: యాపిల్ ముక్కలు నల్లగా మారకుండా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
బీన్స్..
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవాళ్లు.. బీన్స్ తింటే మంచిదిని నిపుణులు చెబుతున్నారు. USDA (ref.) ప్రకారం, 100 గ్రాముల కిడ్నీ బీన్స్‌లో 24.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కిడ్నీ బీన్స్ మన శరీరానికి ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్ కూడా అందిస్తాయి.
Also Read: చిక్కుళ్లతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వదిలిపెట్టరు..!
సిట్రస్ పండ్లు..
కొలెస్ట్రాల్ తొలగించడానికి, సిట్రస్ పండ్లు సహాయపడతాయి. నిమ్మజాతి పండ్లలో కరిగే ఫైబర్, విటమిన్ సీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇవి మిమ్మల్ని ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తాయి.
Also Read: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ టిప్స్ ఫాలో అయితే త్వరగా కరుగుతుంది..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply