క్రెడిట్ కార్డ్‌తో కొంటున్నారా, ఆ మొత్తాన్ని EMIల్లోకి మార్చడం ఇకపై కష్టం కావచ్చు!

[ad_1]

Credit Card EMIs Will Become Tough: బ్యాంకులు ఇచ్చే అసురక్షిత రుణాల (unsecured loans) విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) కఠినంగా వ్యవహరిస్తుండడంతో మార్కెట్‌లో కలకలం రేగింది, ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఆర్‌బీఐ కఠిన వైఖరి వల్ల ప్రజలపై పడే ప్రభావం గురించి రోజుకొక విషయం బయటకు వస్తూనే ఉంది. 

పర్సనల్ లోన్‌ & క్రెడిట్‌ కార్డ్‌ వంటి అన్‌-సెక్యూర్డ్‌ లోన్స్‌ విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ రెండు గట్టి నిర్ణయాలు తీసుకుంది. మొదటిది.. బజాజ్ ఫైనాన్స్ రన్‌ చేస్తున్న రెండు ప్రొడక్ట్స్‌ను నిషేధించింది (RBI Ban on Bajaj Finance Products). రెండోది… బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (NBFCs) ఇచ్చే వ్యక్తిగత రుణాలపై రిస్క్ వెయిట్‌ను (Risk weight on personal loans) 100 బేసిస్‌ పాయింట్ల నుంచి 125 బేసిస్‌ పాయింట్లకు పెంచింది. ఈ నిర్ణయాల వల్ల పర్సనల్ లోన్ సెగ్మెంట్‌ సైలెంట్‌ అయింది. పర్సనల్‌ లోన్‌ వడ్డీ రేట్లు అతి త్వరలో పెరుగుతాయి, రుణ మొత్తాలు తగ్గుతాయని మార్కెట్‌ అంచనా వేసింది.      

EMI బెనిఫిట్స్‌ అందుబాటులో ఉండవు!         
క్రెడిట్ కార్డ్ EMIల విషయంలోనూ చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌బీఐ వైఖరి వల్ల… క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లు, వాటిపై వచ్చే డిస్కౌంట్లు ప్రభావితం అయ్యే అవకాశం బలంగా కనిపిస్తోంది. క్రెడిట్‌ కార్డ్‌ కొనుగోళ్లను EMIలుగా మార్చుకునే ఆప్షన్‌ను బ్యాంకులు, NBFCలు పరిమితం చేస్తాయని మార్కెట్‌ భావిస్తోంది. పెద్ద కొనుగోళ్లను ఈఎంఐల రూపంలోకి మార్చుకుంటే ప్రస్తుతం అందుతున్న రాయితీలు, ప్రయోజనాలు ఇకపై తగ్గిపోవచ్చు. EMI రూపంలో రుణాలు తీసుకోవడం, వస్తువులు కొనడం కూడా ఈజీగా ఉండకపోవచ్చు.     

EMIల రూపంలో వ్యక్తిగత రుణాలను అందించడంలో NBFCలు ముందంజలో ఉన్నాయి. ఈ రంగంలో అతి పెద్ద కంపెనీ అయిన బజాజ్ ఫైనాన్స్‌. కేంద్ర బ్యాంక్‌ తీసుకున్న చర్య బజాజ్‌ ఫైనాన్స్‌తో పాటు ఈ విభాగంలోని మిగిలిన కంపెనీలను కూడా నిరుత్సాహపరుస్తుంది. ఆ ప్రభావం అంతిమంగా కస్టమర్లపై పడుతుంది.     

చాలా రెట్లు పెరిగిన వ్యక్తిగత రుణాలు      
గత కొన్నేళ్లుగా వ్యక్తిగత రుణాల విభాగం విపరీతంగా పెరుగుతోంది. పర్సనల్‌ లోన్‌ అంటే, హామీ లేకుండా ఇచ్చే రుణం. ఇది బ్యాంక్‌లు, NBFCలకు హై రిస్కీ వ్యవహారం. కొన్ని సంవత్సరాలుగా పర్సనల్‌ లోన్ల మొత్తం అనేక రెట్లు పెరగడంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అన్‌-సెక్యూర్డ్‌ లోన్ల విషయంలో బ్యాంకులు,  మరియు NBFCలు నియంత్రణ పాటించాలని గతంలో కూడా హెచ్చరించింది. ఒక నివేదిక ప్రకారం, 2022 జనవరి నాటికి, రూ.50 వేల కంటే తక్కువ విలువైన వ్యక్తిగత రుణాలు మొత్తం రిటైల్ రుణాల్లో 25 శాతానికి చేరుకున్నాయి. రిటైల్ రుణాల్లో పర్సనల్‌ లోన్‌తో పాటు విద్య, ప్రయాణం, కన్స్యూమర్‌ డ్యూరబుల్, కార్‌, బైక్‌ లోన్స్‌ కూడా ఉంటాయి. 

మరో ఆసక్తికర కథనం: డిసెంబర్‌లో బ్యాంకులకు 18 రోజులు సెలవులు, బ్యాంక్‌ సిబ్బంది సమ్మె కూడా! 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *