క్రెడిట్‌ కార్డ్‌తో కొనిపడేసిన జనం – అక్టోబర్‌లో రూ.లక్షల కోట్ల షాపింగ్‌

[ad_1]

Credit Card Spendings in October 2023: మన దేశంలో, ఈ ఏడాది పండుగల సీజన్‌లో పాత రికార్డులు బద్ధలయ్యాయి. జనం విపరీతంగా షాపింగ్‌ చేశారు. నెలల తరబడి కాంతి లేని మార్కెట్‌, సెప్టెంబర్‌ & అక్టోబర్‌ నెలల్లో శోభాయమానంగా వెలిగింది. ఫెస్టివ్‌ సీజన్‌లో, క్రెడిట్ కార్డ్ వాడకంలో పాత రికార్డులు గల్లంతయ్యాయి. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్‌లో కొనుగోళ్లు కొత్త గరిష్టాలను చేరాయి. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిపోర్ట్‌ ప్రకారం, 2023 అక్టోబర్‌లో క్రెడిట్ కార్డ్‌ల ఖర్చు 38.3 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు (ఒక లక్ష 78 వేల కోట్ల రూపాయలు) చేరుకుంది. గత 9 నెలల్లో ఇదే అతి పెద్ద మొత్తం. 

ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో ప్రజలు ఖర్చు పెట్టిన మొత్తం రూ.1.42 లక్షల కోట్లు (ఒక లక్ష 42 వేల కోట్ల రూపాయలు). దీనితో పోలిస్తే, అక్టోబర్‌ వ్యయం 25.4% పెరిగింది. నవంబర్ లెక్కలు ఇంకా అదిరిపోతాయని మార్కెట్‌ అంచనా.

ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో పెరిగిన రష్‌

2023 అక్టోబర్‌లో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన కొనుగోళ్లు (Credit card spendings in October 2023) 30 శాతం పెరిగి రూ.1.20 లక్షల కోట్లకు ‍‌(రూ.1,20,794.40 కోట్లు) చేరుకున్నాయి. అదే కాలంలో, పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్స్ వద్ద క్రెడిట్ కార్డ్ వినియోగం 16 శాతం పెరిగి రూ.57,774 కోట్లకు చేరుకుంది.

అక్టోబర్‌ నెలలో, సగటున ఒక్కో క్రెడిట్‌ కార్డ్‌ మీద రూ.18,898 ఖర్చు చేశారు. ఇది దాదాపు 16 శాతం పెరిగింది. డబ్బు ఖర్చు పెడుతున్న వారిలో 65 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్ కోసం క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌ది అత్యధిక వాటా. నో కాస్ట్ ఈఎంఐ (No Cost EMI on Credit Cards) సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తర్వాత క్రెడిట్ కార్డుల వినియోగం ఇంకా పెరిగింది.

జనం ఎక్కువగా వాడిన కార్డ్‌ ఇదే…

అక్టోబర్‌లో, SBI కార్డ్ దూసుకెళ్లింది, మిగిలిన కంపెనీలను వెనుక్కు నెట్టి 42 శాతం వృద్ధిని (spendings through SBI credit card) సాధించింది. ఈ కార్డుల ద్వారా యూజర్లు రూ.35 వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank credit card), యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌ల (Axis Bank credit card) ద్వారా  35 శాతం ఎక్కువ లావాదేవీలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల (HDFC Bank credit card) ద్వారా 17 శాతం ఎక్కువ లావాదేవీలు జరిగాయి. సిటీ కార్డ్ వినియోగం కూడా పెరిగింది. కొనుగోళ్లలో చాలా వరకు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బట్టలు కోసం ప్రజలు వెచ్చించారు. 

రూపాయల పరంగా చూస్తే… హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ల ద్వారా ఖర్చు పెట్టిన మొత్తం రూ.45,172 కోట్లుగా నమోదైంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ల ద్వారా రూ.34158 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ల ద్వారా రూ.21,728.93 కోట్లు, ఎస్‌బీఐ కార్డ్‌ల ద్వారా రూ.35,406.01 కోట్లను ప్రజలు చెల్లించారు.

అక్టోబర్‌ నెలలో దేశంలోని బ్యాంకులు 16.9 లక్షల కార్డులు జారీ చేశాయి. దీంతో, మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య (credit cards in India 2023) 9.47 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్‌లో ఈ నంబర్‌ 9.30 కోట్లుగా ఉంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరో ఆసక్తికర కథనం: పడింది రెండు పైసలే, కానీ ఆ దెబ్బకు ఆల్ టైమ్ కనిష్టం కనిపించింది

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *