గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం

[ad_1]

Home Loan EMI Calculator: వరుసగా ఆరోసారి కూడా రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) తన రెపో రేటును పెంచింది. రెపో రెటును 0.25 శాతం లేదా 25 బేసిస్‌ పాయింట్లు RBI పెంచింది. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు 0.25 శాతం రెపో రేటు పెంపునకు అనుగుణంగా ఓటు వేశారు. దీంతో, మొత్తం రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి (RBI Repo Rate) చేరింది. 

మీరు సొంత ఇల్లు కొనాలన్న ప్లాన్‌లో ఉంటే, కొత్త సంవత్సరంలో హోమ్‌ లోన్‌ మరింత ఖరీదుగా మారుతుంది. అంతేకాదు, మీరు ఇప్పటికే గృహ రుణం తీసుకుని నెలనెలా EMIలు చెల్లిస్తుంటే, ఇకపై ఆ నెలవారీ వాయిదాల మొత్తం కూడా మరింత భారంగా మారుతుంది. 

RBI రెపో రేటు పెంపు ప్రభావం     
ఆర్‌బీఐ రెపో రేటు పెరగడంతో, అన్ని బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వరకు గృహ రుణాల వడ్డీ రేట్లను పెంచుతాయి. ఆ ప్రభావం మీ EMI మీద పడుతుంది. మీ EMI మీద ఎంత భారం పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

రూ. 25 లక్షల గృహ రుణంపై EMI ఎంత పెరుగుతుంది?           

  
దేశంలోని అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI‌), మీకు 8.60 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాల పరిమితికి రూ. 25 లక్షల గృహ రుణం ఇచ్చిందని అనుకుందాం. దాని మీద ఇప్పుడు మీరు నెలనెలా రూ. 21,854 ఈఎంఐ చెల్లిస్తున్నారని భావిద్దాం. ఇప్పుడు, రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగిన తర్వాత, బ్యాంక్‌ వడ్డీ రేటు 8.85 శాతానికి పెరుగుతుంది. దాని మీద EMI రూపంలో రూ. 22,253 చెల్లించాలి. అంటే, రూ. 25 లక్షల గృహ రుణం మీద నెలనెలా మీరు అదనంగా రూ. 399 (22,253- 21,854) చెల్లించాలి.

రూ. 40 లక్షల గృహ రుణం EMI ఎంత పెరుగుతుంది?                 
ప్రస్తుతం, 8.60 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాల పరిమితికి, రూ. 40 లక్షల గృహ రుణం మీద EMI రూ. 34,967 గా ఉంది. ఇప్పుడు, రెపో రేటులో 0.25 శాతం పెరిగిన తర్వాత, వడ్డీని 8.85 శాతం చొప్పున చెల్లించాలి. అప్పుడు EMI మొత్తం రూ. 35,604 గా మారుతుంది. అంటే ప్రతి నెలా మీరు రూ. 637 (35,604 – 34,967) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

రూ. 50 లక్షల గృహ రుణం EMI ఎంత పెరుగుతుంది?          
15 సంవత్సరాలకు, రూ. 50 లక్షల గృహ రుణానికి 8.60 శాతం చొప్పున ఈఎంఐ రూ. 49,531 గా ఇప్పుడు ఉంది. రెపో రేటు 0.25 శాతం పెరిగిన తర్వాత, ఇప్పుడు మీరు రూ. 50,268 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతి నెల మీరు రూ. 737 ‍‌(50,268 – 49,531) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.            

ALSO READ:  రెపో రేటును 0.25 శాతం పెంచిన ఆర్‌బీఐ, బ్యాంక్‌ రుణాల మీద వడ్డీ రేట్లూ పెరుగుతాయ్‌

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *