[ad_1]
LPG Cylinder Price Reduced: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, 08 మార్చి 2024న, కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళలకు బహుమతి ప్రకటించింది. ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. శుక్రవారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X అకౌంట్‌లో ఈ విషయాన్ని దేశ ప్రజలతో ప్రధాని పంచుకున్నారు.
ప్రధాన మంత్రి ప్రకటన తర్వాత, వంట గ్యాస్ సిలిండర్ల కొత్త రేట్లు ఈ రోజు (శనివారం 09 మార్చి 2024) నుంచి అమలులోకి వచ్చాయి. ఈ రోజు నుంచి LPG సిలిండర్ బుక్ చేసుకునేవాళ్లకు రూ.100 డిస్కౌంట్ లభిస్తుంది.
ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్ ధర ఎంత? (Gas Cylinder Price today)
నిన్నటి (శుక్రవారం) వరకు, దేశ రాజధాని దిల్లీలో గృహ వినియోగదార్లకు 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ రూ. 903 కు లభించింది. ఈ రోజు నుంచి అది రూ. 803 కి తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో LPG సిలిండర్ కొత్త ధరలు:
హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (Domestic LPG Cylinder Price In Hyderabad) రూ. 855కి అందుబాటులో ఉంది.
విజయవాడలో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (Domestic LPG Cylinder Price In Vijayawada) రూ. 855కి అందుబాటులో ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో LPG సిలిండర్ కొత్త ధరలు:
న్యూదిల్లీలో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 803 కు అందుబాటులో ఉంది.
ముంబైలో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 802.50కి అందుబాటులో ఉంది.
చెన్నైలో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 818.50కి అందుబాటులో ఉంది.
కోల్‌కతాలో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 829కి అందుబాటులో ఉంది.
నోయిడాలో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 800.50కి అందుబాటులో ఉంది.
గురుగావ్‌లో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 811.50కి అందుబాటులో ఉంది.
చండీగఢ్‌లో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 912.50కి అందుబాటులో ఉంది.
జైపుర్‌లో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 806.50కి అందుబాటులో ఉంది.
లక్‌నవూలో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 840.50కి అందుబాటులో ఉంది.
బెంగళూరులో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 805.50కి అందుబాటులో ఉంది.
పట్నాలో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 892.50కి అందుబాటులో ఉంది.
పీఎం ఉజ్వల యోజన లబ్దిదార్లకు మరింత చౌక
మరోవైపు.. పీఎం ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana – PMUY) లబ్ధిదార్లు ఒక్కో సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీ పొందుతున్నారు. వాళ్లకు, పీఎంయూవై సబ్సిడీ రూ. 300 + తాజా తగ్గింపు రూ. 100 కలిపి, మొత్తం రూ. 400 తగ్గుతుంది. దీంతో, పీఎం ఉజ్వల యోజన లబ్ధిదార్లకు, దిల్లీలో ఒక్కో సిలిండర్ రూ. 503 కే అందుబాటులోకి వచ్చింది. దేశంలోని మిగిలిన నగరాల్లో దాదాపు ఇదే రేటుకు 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. రవాణా ఛార్జీల కారణంగా ఈ రేటు అతి స్వల్పంగా మారొచ్చు.
సిలిండర్ల ధరల తగ్గింపు గురించి ట్వీట్ చేసిన ప్రధాని మోదీ, ఇది మహిళల జీవితాలను మరింత సౌలభ్యంగా మారుస్తుందని, దేశంలోని కోట్లాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని రాశారు. దీనికి ఒకరోజు ముందే, పీఎం ఉజ్వల యోజన కింద వంట గ్యాస్ సిలిండర్లపై ఇచ్చే రాయితీని మరో ఏడాది పాటు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మరో ఆసక్తికర కథనం: బ్యాంక్ ఉద్యోగులకు భలే శుభవార్త, జీతాలు ఏకంగా 17 శాతం పెంపు
మరిన్ని చూడండి
[ad_2]
Source link
Leave a Reply